Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాకింగ్ లేదా మెట్లు ఎక్కడం… ఫ్యాట్ కరిగి, వేగంగా బరువు తగ్గాలంటే రెండింట్లో ఏది బెటర్!

నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది సరైన శారీరక వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మందికి అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అనేవి ప్రధాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి మెట్లు ఎక్కడం ఒక సులభమైన పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. మెట్లు ఎక్కడం శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు. సాధారణ నడక వర్సెస్‌ మెట్లు ఎక్కడం.. ఈ రెండింటీలో శరీరానికి ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Apr 02, 2025 | 11:03 AM

వాకింగ్, మెట్లు ఎక్కడం ఈ రెండింటిలో మెట్లు ఎక్కడం వలన ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయని చెబుతున్నారు.. కాబట్టి ఫ్యాట్ కూడా ఎక్కువగా కరిగిపోతుంది. ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునే వారికి వాకింగ్ ఎంతో మంచి ఎక్సర్‌సైజ్. వాకింగ్ ను రెగ్యులర్ గా చేయడం అలవాటు చేసుకోవాలి. అయితే మెట్లు ఎక్కడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

1 / 5
మెట్లు ఎక్కడం- చాలా ఎఫెక్ట్ ఎక్సర్‌సైజ్: వాకింగ్‌తో పోల్చుకుంటే మెట్లు ఎక్కడం అనేది చాలా ఎఫెక్టివ్ ఎక్సర్‌సైజ్. దీని వలన ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. కండరాలు ధృడంగా మారతాయి. మెట్లు ఎక్కడం వల్ల 8.6 నుంచి 9.6 రెట్లు ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో, బరువును నియంత్రించడంలో సాయపడుతుంది. ప్రతి రోజూ మెట్లు ఎక్కడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది.

2 / 5
వాకింగ్, మెట్లు ఎక్కడం....రెండూ ముఖ్యమే: బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం, మెట్లు ఎక్కడం రెండు చేయాలి. రెగ్యులర్‌గా ఈ వ్యాయామాలు చేయడం వలన ఫ్యాట్ కరిగిపోతుంది. జీవక్రియ మెరుగవుతుంది. ప్రత్యేకమైన వ్యాయామ పద్ధతులు అవసరం లేకుండా మెట్లు ఎక్కడం ద్వారా కూడా కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు.

3 / 5
అంతేకాదు.. మాములు నడక కంటే కూడా వేగంగా నడవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్​ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని సైతం దూరంగా ఉంచొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేగంగా న‌డ‌వ‌టం వ‌ల్ల ఏరోబిక్ ఆక్టివిటీ పెరుగుతుంది. రోజూ 10 వేల అడుగులు న‌డ‌వ‌టం వ‌ల్ల గుండె సంబంధిత, అకాల మ‌ర‌ణాల ముప్పు నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

4 / 5
మెట్లు ఎక్కడమే కాస్త మేలు: ప్రతిరోజూ మెట్లు ఎక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల శారీరక ఆరోగ్యమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడుతుంది. ఇది ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాకింగ్, మెట్లు ఎక్కడం రెండూ... ప్రయోజనకరమే అయినప్పటికీ మెట్లు ఎక్కడం వలన తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది.

5 / 5
Follow us