AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 21కి చేరిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్భ్రాంతి

పేలుడు ధాటికి గోడౌన్ స్లాబ్ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగినట్టుగా చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీసేందుకు ఫోరెన్సిక్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గోదాంలో అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్టుగా వివరించారు.

బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 21కి చేరిన మృతుల సంఖ్య.. ప్రధాని దిగ్భ్రాంతి
Firework Factory In Gujarat
Jyothi Gadda
|

Updated on: Apr 02, 2025 | 12:37 PM

Share

గుజరాత్ లోని దీసా పట్టణంలో మంగళవారం బాణసంచా గోడౌన్‌లో భారీ పేలుడు సంబంవించింది.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 21 చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఐదుగురు పిల్లలు, ఐదుగురు మహిళలు కూడా ఉన్నట్లు తెలిపారు. వీరంతా మధ్యప్రదేశ్‌లోని హర్దా, దేవాస్ జిల్లాల నుండి వచ్చిన కార్మికులుగా అధికారులు నిర్దారించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గోడౌన్‌లోని బాయిలర్‌ పేలడంతో పైకప్పు, కొన్ని గోడలు కూలిపోయాయి. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది. పేలుడు ధాటికి గోడౌన్ స్లాబ్ కూలిపోవడంతో ప్రాణనష్టం జరిగినట్టుగా చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీసేందుకు ఫోరెన్సిక్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. గోదాంలో అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.
లైవ్ మ్యాచ్‌లో బాబర్ ఆజంను అవమానించిన స్టీవ్ స్మిత్.. కట్‌చేస్తే.