Viral Video: చేతిపై కుట్టడానికి దోమ తిప్పలు.. ట్రైనింగ్‌లో ఉందేమో అంటూ ఫన్నీ కామెంట్స్ .. ఓ లుక్ వేయండి మరి
ప్రస్తుతం సోషల్ మీడియాలో దోమకు సంబందించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక దోమ ఒక మనిషి మీద వాలింది. అతనిని కుట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో దోమ పడిన తిప్పలు చూస్తే ఎవరైనా అవాక్కవుతారు. తర్వాత నవ్వుతారు. ఈ దోమని చూసి మొత్తం దోమల సమాజం సిగ్గుపడాల్సిందే అంటూ ఓ క్యాప్షన్ జత చేశారు. లక్షాలాది మందిని ఆకట్టుకున్న ఈ వీడియో రకారకాల కామెంట్స్ ను కూడా సొంతం చేసుకుంది.

వేసవి కాలం వచ్చేసింది దీంతో దోమలు కూడా మేమున్నాం అంటూ వచేశాయి. ఇవి పెట్టె ఇబ్బంది గురించి ఎంత చెప్పినా తక్కువే. మనుషుల మీద వాలి రక్తం పీల్చడమే కాదు.. రకరకాల వ్యాధులను కూడా సరఫరా చేస్తాయి కూడా. దీంతో దోమల నివారణ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇప్పుడు ఒక దోమకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి చేతిపై దోమ వాలింది. తర్వాత తన డ్యూటీ చేయడానికి అది పడిన తిప్పలు చూసి వారు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారు దోమలకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక దోమ ఒక వ్యక్తీ చేతి మీద వాలింది. అది అతనిని తన తొండంతో గుచ్చడానికి ప్రయత్నిస్తుంది. ఎంత సేపు ఎన్ని సార్లు ప్రయత్నించినా ఆ దోమ తొండం చర్మంలోపలికి వెళ్ళలేదు. దీంతో అక్కడకక్కడ ప్లెసే మారుస్తూ తన తొండాన్ని చర్మంలోకి దింపడానికి తెగ ప్రయత్నించింది. అయినా సరే దాని తొండం వంగి పోయింది కానీ.. రక్తాన్నీ పీల్చడం దాని వల్ల కాకాలేదు. కొత్తగా డ్యూటీకి వచ్చిన వారిలా.. ఈ దోమ కూడా రక్తం పీల్చడంలో అనుభవం లేనట్లుగా తిప్పలు పడింది. ఇది చూసి ప్రజలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఈ దృశ్యాన్ని చాలా ఆస్వాదిస్తున్నారు.
पूरा मच्छर समाज शर्मिंदा है! 😂 pic.twitter.com/7XGm0xxexE
— Aditi (@Aditeaaa_) April 2, 2025
@Aditeaaa_x హ్యాండిల్ అదితి అనే యూజర్ ఈ వీడియోను షేర్ చేసి, “మొత్తం దోమల సమాజం సిగ్గుపడాలి!” అని వ్యంగ్యంగా క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను ఇప్పటివరకు 18 లక్షల మందికి పైగా వీక్షించారు, రకరకాల ఫన్నీ వ్యాఖ్యలను చేస్తున్నరు. ఈ దోమ ఇంకా ట్రైనింగ్‌లోనే ఉన్నట్టుంది అని ఒకరు, ఈ దోమకు జబ్బు చేసినట్లుంది పాపం.. డ్యూటీ చేయలేకపోతోంది అని మరికొందరు ఈ దోమ దోమలు సమాజానికి అవమానం తెచ్చిపెట్టింది అని రకరకాల కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. రకరకల్ ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..