AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సీపీఆర్‌ చేసి కార్యకర్త ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే… ఎంతైనా డాక్టర్‌ డాక్టరే అనిపించుకున్న తెల్లం వెంకట్‌రావు

డాక్టర్లు ఎమ్మెల్యేలైతే ఆ నియోజకవర్గం ప్రజలకు టూ ఇన్‌ వన్‌ బంపర్‌ ఆఫర్‌ లాంటిదే. ఇటు ప్రజా సేవ చేస్తూనే ఎమర్జెన్సీ సమయంలో డాక్టర్‌గా వైద్యం అందిస్తుంటారు. తాజాగా భద్రచాలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విషయంలో కూడా అదే జరిగింది. ఎమ్మెల్యే కాకముందు తెల్లం వెంకట్రావు స్వతహాగా డాక్టర్‌. ఆయన అక్కడ ఉండడం అదృష్టమో ఏమో గానీ.. కాంగ్రెస్ నేత సుధాకర్...

Video: సీపీఆర్‌ చేసి కార్యకర్త ప్రాణం కాపాడిన ఎమ్మెల్యే... ఎంతైనా డాక్టర్‌ డాక్టరే అనిపించుకున్న తెల్లం వెంకట్‌రావు
Mla Tellam Venkatrao Cpr
K Sammaiah
|

Updated on: Apr 04, 2025 | 7:34 PM

Share

డాక్టర్లు ఎమ్మెల్యేలైతే ఆ నియోజకవర్గం ప్రజలకు టూ ఇన్‌ వన్‌ బంపర్‌ ఆఫర్‌ లాంటిదే. ఇటు ప్రజా సేవ చేస్తూనే ఎమర్జెన్సీ సమయంలో డాక్టర్‌గా వైద్యం అందిస్తుంటారు. తాజాగా భద్రచాలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విషయంలో కూడా అదే జరిగింది. ఎమ్మెల్యే కాకముందు తెల్లం వెంకట్రావు స్వతహాగా డాక్టర్‌. ఆయన అక్కడ ఉండడం అదృష్టమో ఏమో గానీ.. కాంగ్రెస్ నేత సుధాకర్ ప్రాణాలతో బయటపడ్డారు.

సుధాకర్‌కు గుండెపోటు వచ్చిన సమయంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెకట్‌రావు ప్రాణదానం చేశారు. ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత సుధాకర్‌కు గుండెపోటు వచ్చింది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే సీపీఆర్‌ చేసి ప్రాణం కాపాడారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సుధాకర్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆరోగ్యం

ఎమ్మెల్యే చేసింది కూడా సాదాసీదా సీపీఆర్ కాదు.. నోటి ద్వారా మెడిసిన్ అందిస్తూ సరైన పద్ధతిలో చేసిన ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌తో వెంటనే లేచి కూర్చున్నారు సుధాకర్. అక్కడి వారంతా ఎమ్మెల్యే తన వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించి కాంగ్రెస్ నేతను రక్షించారని ప్రశంసించారు. ఓ వైపు ప్రజా సేవలో ఉంటూనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తన వైద్య నైపుణ్యాన్ని కూడా వినియోగించి ప్రాణాలను రక్షించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటనకు సంబంధించిన, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వీడియో చూడండి: