Gold Price Today: గోల్డెన్ న్యూస్.. రూ. 56 వేలకు దిగిరానుందా.? తులంపై ఎంత తగ్గిందంటే
ట్రంప్ టారిఫ్స్ దెబ్బతో అన్ని అతలాకుతలం అవుతున్నాయ్. ఒకవైపు యూఎస్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంటే.. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అవుతున్నాయ్. ఇక ఎల్లో మెటల్ విషయానికొస్తే ఒక్క రోజులోనే భారీగా పడింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ బాదుడుతో అటు స్టాక్ మార్కెట్లు.. ఇటు ఎల్లో మెటల్స్.. మరోవైపు క్రూడ్ ఆయిల్ లాంటివి అన్ని కూడా అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ స్టాక్ మార్కెట్లతో పాటు మన దేశీయ మార్కెట్లు కూడా భారీ స్థాయిలో పతనం కాగా.. ఇప్పుడు బంగారం వంతు వచ్చింది. ఒక్క రోజులోనే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1750 మేరకు తగ్గింది. అటు 22 క్యారెట్ల బంగారం కూడా రూ. 1610 మేరకు తగ్గుదల కనిపిస్తోంది. అలాగే బిజినెస్ ఎనలిస్టులు రాబోయే రోజుల్లో 40 శాతం మేరకు తగ్గి.. బంగారం ధరలు రూ. 56 వేలకు దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇవాళ(శనివారం) దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 83,990గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,630గా ఉంది. ఇక బంగాలురు, చెన్నై, ముంబై, కేరళలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 84,140గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,780గా కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు కూడా బంగారం బాటలో పయణిస్తున్నాయి. వరుసగా మూడు రోజుల్లో సుమారు రూ. 6100 మేరకు తగ్గింది వెండి ధర. లక్షల్లో కొనసాగిన వెండి ధరలు ఇప్పుడు రూ. 98,900కి చేరింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 1,07,900గా ఉంది. కేరళ, చెన్నైలోనూ ఇదే ధర కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 98,900గా నమోదైంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..