Gold Investment: మిడిసిపడుతున్న పసిడి.. 25 ఏళ్లుగా రాబడిలో కింగ్..!
బంగారం అనేది ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే నమ్మకమైన పెట్టుబడి సాధనం. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. అయితే జెరోధా సీఈఓ నితిన్ కామత్ ఇటీవల ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. 25 ఏళ్లుగా రాబడిలో కింగ్ మేకర్‌గా బంగారం ఉందని పేర్కొన్నారు.

జెరోధా సీఈఓ నితిన్ కామత్ ఇటీవల మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో బంగారం 2000 సంవత్సరం నుంచి నిఫ్టీ 50 కంటే మెరుగైన రాబడిని సాధించిందని హైలైట్ చేశారు. ముఖ్యంగా గోల్డ్ ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్‌కు సంబంధించిన పెరుగుతున్న ప్రాముఖ్యతను కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత భారతీయ పెట్టుబడిదారులు విలువైన లోహాన్ని పొందేందుకు గోల్డ్ ఈటీఎఫ్‌లు ఉత్తమ మార్గం ఆయన పేర్కొన్నారు. బంగారం ధరల్లో తాజా పెరుగుదల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు పండుగ చేసుకుంటున్నారు. మార్కెట్‌లు పాటు ప్రపంచ అనిశ్చితులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నందున చాలా మంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా చూస్తున్నారు.
అయితే భారతదేశంలో ఏళ్లుగా ప్రజలు ఆభరణాల కోసం భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆభరణం తయారీ సమయంలో తరుగు, మజూరీ వంటి చార్జీల వల్ల బంగారం ధర మరింత ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో పెట్టుబడితో పాటు ఆర్థిక రక్షణ కోసం డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేసిన నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల గురించి కచ్చితంగా తెలుసుకోవాలని చెబుతున్నారు.
బంగారాన్ని చాలా కాలంగా సురక్షితమైన ఆస్తిగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో పోర్ట్ఫోలియో వైవిధ్యాన్ని అందిస్తుంది. దాని ధరల కదలికలు అనూహ్యంగా ఉన్నప్పటికీ, బంగారం సంవత్సరాలుగా భారతీయ పెట్టుబడిదారులు కొనుగోలు ఆసక్తి చూపుతున్నారని కామత్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..