ఈ-కామర్స్ బిజినెస్ మూసివేత దిశ‌గా పేటీఎం?

మొట్టమొదటి మొబైల్, డీటీహెచ్ రీచార్జ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన పేటీఎం సంస్థ ఇప్పుడు దేశంలో అత్యంత పేరొందిన పేమెంట్ యాప్‌గా కొనసాగుతోంది. ఈ సంస్థ ఈ-కామర్స్ సహా వివిధ రకాల సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు పేటీఎం ఈ-కామర్స్ బిజినెస్ నుంచి తప్పుకోనుందనే వార్తలు వెలువడుతున్నాయి. పేటీఎం సంస్థ 2017లో పేటీఎం మాల్ పేరుతో ఈ-కామర్స్ సర్వీసులు ప్రారంభించింది. పేటీఎం మాల్ తన మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నుంచి 2018లో రూ.2,900 కోట్లు సేక‌రించింది. అయితే అప్పటి […]

ఈ-కామర్స్ బిజినెస్ మూసివేత దిశ‌గా పేటీఎం?
Follow us

| Edited By:

Updated on: Mar 17, 2019 | 4:30 PM

మొట్టమొదటి మొబైల్, డీటీహెచ్ రీచార్జ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమైన పేటీఎం సంస్థ ఇప్పుడు దేశంలో అత్యంత పేరొందిన పేమెంట్ యాప్‌గా కొనసాగుతోంది. ఈ సంస్థ ఈ-కామర్స్ సహా వివిధ రకాల సేవలను అందిస్తోంది. అయితే ఇప్పుడు పేటీఎం ఈ-కామర్స్ బిజినెస్ నుంచి తప్పుకోనుందనే వార్తలు వెలువడుతున్నాయి.

పేటీఎం సంస్థ 2017లో పేటీఎం మాల్ పేరుతో ఈ-కామర్స్ సర్వీసులు ప్రారంభించింది. పేటీఎం మాల్ తన మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నుంచి 2018లో రూ.2,900 కోట్లు సేక‌రించింది. అయితే అప్పటి నుంచి భారీ నష్టాలనే చవిచూస్తూ వస్తోంది. ఈ మధ్య‌ కాలంలో ఈ యాప్‌కు 88 శాతం ట్రాఫిక్ తగ్గినట్లు తెలుస్తోంది. 2018 అక్టోబర్‌లో 4.5 కోట్లుగా ఉన్న హిట్స్ జనవరి కల్లా 50 లక్షలకు పడిపోయాయి.

మరోవైపు కంపెనీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ముసివేసింది. పేటీఎం మాల్ ఫెయిల్యూర్‌కు ప్రధాన కారణం విక్రయంకానీ ఇన్వెంటరీ. ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు కొరత కారణంగా దాదాపు రూ.150-రూ.160 కోట్ల విలువైన ఇన్వెంటరీ తమ వద్ద పోగైందని పేటీఎం సెల్లర్లు లబోదిబోమంటున్నారు. కంపెనీ సడన్‌గా పలు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ఎత్తివేయడంతో యాప్ యూజర్ల సంఖ్య తగ్గిందని తెలిపారు.

ఈ-కామర్స్ బిజినెస్ నుంచి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలను కంపెనీ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ కొట్టిపారేశారు. కంపెనీ స్థూల మర్చండైజ్ వ్యాల్యూమ్ 2 బిలియన్ డాలర్లకు పెరిగిందని తెలిపారు. కాగా కంపెనీ బీ2బీ బిజినెస్ మోడల్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని, బీ2సీ మోడల్‌ను క్రమంగా తగ్గించుకుంటూ రావాలనే నిర్ణయానికి వచ్చిందని పేర్కొన్నాయి.