AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన జనసేనాని.. ఆ విషయం సంతోషం కలిగించదంటూ వ్యాఖ్య..

Pawan Thanks To Jagan: తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో దివీస్‌ పరిశ్రమ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తమ గ్రామంలో పరిశ్రమ పెట్టొద్దని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో..

Pawan Kalyan: జగన్‌ మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన జనసేనాని.. ఆ విషయం సంతోషం కలిగించదంటూ వ్యాఖ్య..
Narender Vaitla
| Edited By: |

Updated on: Jan 24, 2021 | 6:43 PM

Share

Pawan Thanks To Jagan: తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో దివీస్‌ పరిశ్రమ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తమ గ్రామంలో పరిశ్రమ పెట్టొద్దని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో నిరసనకు దిగిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజాగా వారిని విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై జనసేన అధ్యక్షుడు, పవన్‌ కళ్యాణ్‌ ఆదివారం స్పందించారు. ఈ విషయమై లేఖను విడుదల చేసిన పవన్‌ అందులో కొన్ని విషయాలను ప్రస్తావించారు.. ‘దివీస్‌ కర్మాగారంతో పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.. వారి సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలి. ఇక దివీస్ నిరసనకారులను ప్రభుత్వం విడుదల చేయడం సంతోషం కలిగించింది. హైకోర్టు, సీఎం జగన్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దివీస్ కర్మాగారం విడుదల చేసే కాలుష్యంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 36 మందిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అరెస్ట్‌ అయిన వారికి బెయిలు రావడానికి సహకరించిన అందరికీ జనసేన తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే వారిపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలి’ అని లేఖలో ప్రస్తావించారు.

Also Read: Antarvedi Temple: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి నూతన రథం.. ట్రయల్ రన్‌లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..