సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి, ఇక నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, కాలుష్య కారకం కకారాదని పానెల్ సూచన

ఢిల్లీలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేబడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని ఈ శాఖలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.

  • Umakanth Rao
  • Publish Date - 4:09 pm, Tue, 29 December 20
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి, ఇక నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్, కాలుష్య కారకం కకారాదని పానెల్ సూచన

ఢిల్లీలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేబడుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇవ్వాలని ఈ శాఖలోని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే  ప్రస్తుత భవనాల కూల్చివేత సమయంలో వాయు కాలుష్యం ఏర్పడకుండా చూడాలని ఈ ప్రాజెక్టు  డెవలపర్ ను ఆదేశించింది. ఎక్స్ పర్ట్ అప్రయిజల్ కమిటీ చేసిన సిఫారసుతో ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు  పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్ఛేసినట్టే ! రేపో, మాపో ఈ శాఖ మంత్రి ఇందుకు అనుమతిస్తారు. ఈ నెల 17 న జరిగిన సమావేశంలో ఈ కమిటీ ఈ మేరకు నిర్ణయించిందని, ఈ మీటింగ్ లో ఆమోదించిన అంశాలను తమ వెబ్ సైట్లో పెట్టామని ఈ శాఖ వెల్లడించింది. సెంట్రల్ పబ్లిక్  వర్క్స్ డిపార్ట్ మెంట్ (సీపీ డబ్ల్యు డీ)..విస్టా ప్రాజెక్టును చేపట్టిన విషయం గమనార్హం. కామన్ సెక్రటేరియట్ బిల్డింగులు, సెంట్రల్ కాన్ఫరెన్స్ సెంటర్, ప్రధాని నివాసం, ఎస్ పీజీ బిల్డింగ్, ఉపరాష్ట్రపతి నివాస సముదాయం వంటి బహుళ భవనాలన్నీ ఇక నిర్మాణం కానున్నాయి. మొదట ఈ ప్రాజెక్టుకు 11,794 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినప్పటికీ ఆ తరువాత ఇది 13,794 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. రీ-డె వలప్ మెంట్ ప్రాజెక్టు కింద కొత్తగా ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఏర్పడనుంది.

ప్రస్తుత భవనాలను కూల్చివేస్తున్నప్పుడు ఇందుకు సంబంధించిన వివరణాత్మక ప్లాన్  ను ఇవ్వాలని కమిటీ డెవలపర్ కు సూచించింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ. దూరం రాచ మార్గాన్ని కూడా నిర్మించనున్నారు.