రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. ఒక్కొక్క సినిమాకు ఏకంగా 135 కోట్లు !!
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏడాదికి నాలుగైదు సినిమా చేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే. వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు..
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏడాదికి నాలుగైదు సినిమా చేసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రమే. వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు అక్షయ్. ఇటు సినిమాలతోను అటు వాణిజ్య ప్రకటనలతోను అక్షయ్ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ఈ యాక్షన్ హీరో గొప్ప మనసు చాటుకోవడంలోనూ ముందుంటాడు. కరోనా సమయంలో భారీగా విరాళం అంధించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇటీవల ‘లక్ష్మీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్ సూపర్ హిట్ ను అందుకున్నాడు.
ఇక ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ప్రపంచంలో అత్యధికంగా పారితోషకం తీసుకునే వందమందిలో అక్షయ్ 52 స్థానంలో నిలిచాడు. ఇటీవల కరోనా కారణంగా తన రెమ్యునరేషన్ ను 99 కోట్లు గా తగ్గించుకున్న అక్షయ్ ఆతర్వాత దానిని కొంచం పెంచి 108 కి వచ్చాడు. ఇప్పుడు మొత్తంగా 117 కోట్లు తీసుకుంటున్నాడు. అయితే అక్షయ్ కు ఉన్న క్రేజ్ , అతడి సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించే వసూళ్లు దృష్టిలో పెట్టుకొని అక్షయ్ కు అంత ముట్టజెప్పడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారట. ఇక 2022 లో అక్షయ్ ప్రతి సినిమాకు 135 కోట్లు తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం అక్షయ్ ఖాతాలో సూర్యవంశీ, అత్రాంగి రే, బెల్ బాటమ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్, పృథ్వీ రాజ్, రామ్ సేతు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలను కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడట అక్షయ్.
Also read :
‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్