New Ration policy is postpone: ‘ఇంటికే రేషన్ సరుకులు’ ఈ నెల లేనట్లే… పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీ.

ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే జనవరి నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కొత్త విధానం...

New Ration policy is postpone: ‘ఇంటికే రేషన్ సరుకులు’ ఈ నెల లేనట్లే... పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీ.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2020 | 3:51 PM

New Ration policy is postpone in AP: ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే జనవరి నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ కొత్త విధానం వాయిదా పడింది. జనవరిలో ఎప్పటిలాగే పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీ ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు. నిజానికి జనవరి నుంచి డోర్ డెలివరీకి అధికారులు అన్ని సిద్ధం చేశారు. అయితే మినీ ట్రక్కుల పంపిణీ కార్యక్రమం ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో డోర్ డెలివరీ విధానాన్ని మొదలుపెడతామని అధికారులు చెబుతున్నారు. ఇక డోర్‌ డెలివరీ విధానం వాయిదా పడిన దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా సరుకులను రేషన్‌ షాపులకు తరలించి జనవరి 4వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభించాల్సిందిగా అధికారులు ఆదేశించారు. Also read: Jagan Government: ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. 2021లో కొలువుల జాతర..!