కొత్త రకం కరోనా ప్రాణాంతకం కాదు.. వేగంగా విస్తరిస్తుందే కానీ చంపేంత ప్రమాదకరం కాదన్న ఆరోగ్య మంత్రి ఈటల
యుకే నుంచి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ ప్రాణాంతకం కాదంటున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్. ఈ కొత్త రకం వైరస్ శరవేగంగా విస్తరించే లక్షణం కలిగి వున్నా...
New variety of coronavirus is not dangerous, says Eetala Rajendar: యుకే నుంచి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ ప్రాణాంతకం కాదంటున్నారు తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్. ఈ కొత్త రకం వైరస్ శరవేగంగా విస్తరించే లక్షణం కలిగి వున్నా.. ప్రాణాంతకం మాత్రం కాదని ఆయనంటున్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని ఈటల రాజేందర్ సూచించారు. కొత్త రకం వైరస్‌పై కేంద్రం అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వుందని ఈటల తెలిపారు.
మంగళవారం ఈటల రాజేందర్ తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావాన్ని, తాజా పరిణామాలను సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ఈటల. ‘‘ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పాత కోవిడ్-10 వైరస్ రూపాంతరం చెందింది.. తప్ప ఇది కొత్త వైరస్ కాదు.. యుకే వైరస్ వేగంగా విస్తరిస్తుంది.. కానీ ప్రాణాంతకం కాదు.. కరోనా సోకకుండా తీసుకున్న ప్రీకాషన్స్, ఇచ్చిన ట్రీట్‌మెంటు.. కొత్త వైరస్ విషయంలోనూ కొనసాగిస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అలర్ట్‌గా ఉంది.. కేంద్ర ప్రభుత్వం యుకే వైరస్ పైన అధ్యయనం చేస్తుంది.. వైరస్ నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. చలికాలం కాబట్టి వైరస్ వేగంగా విస్తరిస్తోంది.. ’’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.