‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్
విజయ్ కూడా పొంగల్ బరిలోకి దిగిపోయాడు. కొద్ది సేపటి క్రితమే 'మాస్టర్' చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

‘Master’ release date : విజయ్ కూడా పొంగల్ బరిలోకి దిగిపోయాడు. కొద్ది సేపటి క్రితమే ‘మాస్టర్’ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది టీమ్. మాళవిక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ చిత్రంలో ఆండ్రియా జెరెమియా, రమ్య సుబ్రమణియన్, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్, నాసర్, ధీనా, సంజీవ్, శ్రీనాథ్, శ్రీమాన్, సునీల్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 9 న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ కూడా యూ/ఏ వచ్చింది. ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై మరింత బజ్ పెరిగింది.
ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో విజయ్ జెడి అనే కళాశాల ప్రొఫెసర్‌గా, కాలేజీ విద్యార్థిగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా మాస్టర్ ఒకేసారి విడుదల అవుతుంది. చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందించారు. లెట్స్ సీ విజయ్ ఈ సంక్రాంతికి అభిమానులను ఏ రేంజ్‌లో ఇంప్రెస్ చేస్తాడో..!
Aana aavanna apna time na Vanganna vanakkamna
Ini #VaathiRaid na! ?#Vaathicoming to theatres near you on January 13. #Master #மாஸ்டர்#మాస్టర్#VijayTheMaster #MasterPongal #MasterOnJan13th pic.twitter.com/RfBqIhT95U
— XB Film Creators (@XBFilmCreators) December 29, 2020
Also Read : భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్.. హృదయానికి హద్దుకుంటోన్న ‘ఆహా’ సామ్‌జామ్ కొత్త ప్రోమో..