మరో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన చైనా.. దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా.?

శాస్ర్త సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేయాలని పరితపిస్తోన్న చైనా ఆ దిశలో మరో ముందడుగా వేసింది. తాజాగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని విజయంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని చైనా అంతరిక్ష సంస్థ...

మరో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన చైనా.. దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2020 | 2:51 PM

China test remote sensing satilite: శాస్ర్త సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేయాలని పరితపిస్తోన్న చైనా ఆ దిశలో మరో ముందడుగా వేసింది. తాజాగా రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని విజయంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని చైనా అంతరిక్ష సంస్థ వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఆదివారం ప్రయోగించింది.

ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశించినట్లు చైనా మీడియా తెలిపింది. యోగాన్-33 పేరుతో పిలిచే ఈ ఉపగ్రహాన్ని లాంగ్ మార్చ్-4సీ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. ఈ ఉగ్రహం ద్వారా భూ వనరుల సర్వే, పంట దిగుబడి అంచనాలతో పాటు విపత్తుల నియంత్రణ వంటి లాభాలు చేకూరనున్నాయి.

లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ మిషన్ సిరీస్‌లో ఇది 357వ మిషన్ అని శాస్ర్తవేత్తలు తెలిపారు. ఇక ఈ మిషన్ ద్వారానే మైక్రో, నానో సాంకేతిక ప్రయోగ ఉపగ్రహాన్ని కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

Also read: గగన్‌యాన్ కోసం గ్రీన్ ప్రొపల్షన్ రాకెట్ సిద్ధం.. వచ్చే ఏడాది ఉంటుందన్న ఇస్రో చైర్మన్ శివన్