AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చెట్టు కలప అత్యంత ఖరీదు.. ఆకులు ఆరోగ్యానికి అమృతం! ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అనాల్సిందే..

టేకు చెట్టు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది బలమైన కలప. కేవలం కలపకే కాకుండా టేకు ఆకులు (Teak Leaves) కూడా ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు.. సాధారణంగా మనం టేకును ఫర్నిచర్ కోసమే వాడుతుంటాం. కానీ వీటి ఆకుల్లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఆశ్చర్యకరం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం టేకు ఆకులు ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తాయి. టేకు ఆకుల వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు, వాటిని ఎలా వాడాలో ఇక్కడ చూడండి.

Jyothi Gadda
|

Updated on: Apr 05, 2026 | 12:32 PM

Share
చర్మ సమస్యలకు పరిష్కారం: టేకు ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రధానంగా చర్మ వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.  టేకు ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఆకులను మెత్తగా నూరి చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద, ఇతర ఇన్ఫెక్షన్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

1 / 6
గాయాలను నయం చేయడం: ఎక్కడైనా తెగినా లేదా దెబ్బలు తగిలినా, టేకు ఆకుల రసాన్ని రాస్తే రక్తస్రావం ఆగిపోవడమే కాకుండా గాయం త్వరగా మానిపోతుంది. ఇందులోని యాంటీ సెప్టిక్ గుణాలు ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయి. టేకు ఆకుల రసాన్ని గాయాలు, దురద, ఎగ్జిమా వంటి సమస్యలకు రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

2 / 6
జ్వరం, తలనొప్పి: అలాగే, ఈ ఆకులతో చేసిన కషాయం జ్వరం, గొంతు నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. టేకు ఆకుల కషాయాన్ని తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల సీజనల్ జ్వరాలు తగ్గుతాయి. అలాగే తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ ఆకుల రసాన్ని నుదుటిపై రాస్తే ఉపశమనం లభిస్తుంది.

3 / 6
రక్తహీనత నివారణ:  రక్తహీనత (Anemia) సమస్య ఉన్నవారికి టేకు ఆకులు మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. టేకు ఆకుల్లో ఉండే కొన్ని పోషకాలు రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహాయపడతాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహకరిస్తుంది.

4 / 6
జుట్టు ఆరోగ్యం: కొంతమంది టేకు ఆకుల రసాన్ని జుట్టుకు కూడా ఉపయోగిస్తారు. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను బలంగా ఉంచడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అయితే, వీటిని నేరుగా తీసుకోకుండా సరైన పద్ధతిలో వాడాలి. అతిగా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవచ్చని, ముఖ్యంగా చర్మంపై రాసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

5 / 6
జాగ్రత్తలు, సైడ్ ఎఫెక్ట్స్: టేకు ఆకులను వాడే ముందు వాటిని శుభ్రంగా కడగాలి. కొంతమందికి టేకు ఆకుల రసం వల్ల చర్మంపై అలర్జీ రావచ్చు, కాబట్టి ముందుగా కొద్దిగా రాసి పరీక్షించుకోవాలి. గర్భిణీలు, చిన్న పిల్లలకు వీటిని ఇచ్చే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.

6 / 6
Follow Us