భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్.. హృదయానికి హద్దుకుంటోన్న ‘ఆహా’ సామ్‌జామ్ కొత్త ప్రోమో..
‘ఆహా’ ఓటీటీ వేదికలో అక్కినేని సమంత వ్యాఖ్యతగా ‘సామ్ జామ్’ అనే టాక్ షో రన్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ షోలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ జీవిత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా...

Bunny gets emotional in sam jam show: ‘ఆహా’ ఓటీటీ వేదికలో అక్కినేని సమంత వ్యాఖ్యతగా ‘సామ్ జామ్’ అనే టాక్ షో రన్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ షోలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ జీవిత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా మరో మెగా హీరో అల్లు అర్జున్ తన తండ్రి అరవింద్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో.. అభిమానుల హృదయాలను తాకుతోంది. గతంలో అల వైకుంఠపురం సినిమా వేడుకలో మాట్లాడిన అల్లు అర్జున్ తన తండ్రి గొప్పతనాన్ని వివరించాడు. ‘కొడుకు పుట్టిన తర్వాత నాకు ఒక విషయం అర్థమయ్యింది. నేను మా నాన్న అంత గొప్పవాడిని కాదు. ఆయనలో సగం కూడా నేను ఎప్పుడూ అవ్వలేను’ అని చెప్పిన మాటలు అప్పట్లో వైరల్‌గా మారాయి. తాజాగా సామ్‌జామ్ షోలో ఈ వీడియోను ప్లే చేశారు. ఈ వీడియో చూస్తున్నంత సేపు అటు అల్లు అర్జున్‌తో పాటు సమంత కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. అర్జున్ పాల్గొన్న ఈ కార్యక్రమం జనవరి 1న ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానుంది. మరి ఈ మెగా హీరో మరెన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడో తెలియాలంటే జనవరి 1వ తేదీ వరకు వేచి చూడాలి.
also read: