AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: టోల్ టాక్స్ కట్టమన్నందుకు సిబ్బందికి చుక్కలు చూపించిన సర్కార్ ఉద్యోగి..!

ప్రభుత్వ అధికారిని అనే ఒకే ఒక్క హోదా చూసుకుని టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ పెద్ద మనిషి. అధికారం ఉందనే గర్వమో.. లేక ఏం చేసినా చెల్లుతుందనే అభిప్రాయమో తెలియదు గానీ, టోల్ మినహాయింపు ఇవ్వాలని అడగడమే కాకుండా ఇవ్వనందుకు సిబ్బందిపై దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది.

Hyderabad: టోల్ టాక్స్ కట్టమన్నందుకు సిబ్బందికి చుక్కలు చూపించిన సర్కార్ ఉద్యోగి..!
Attack On Toll Gate Staff
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Balaraju Goud

Updated on: Apr 15, 2025 | 5:45 PM

ప్రభుత్వ అధికారిని అనే ఒకే ఒక్క హోదా చూసుకుని టోల్ గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ పెద్ద మనిషి. అధికారం ఉందనే గర్వమో.. లేక ఏం చేసినా చెల్లుతుందనే అభిప్రాయమో తెలియదు గానీ, టోల్ మినహాయింపు ఇవ్వాలని అడగడమే కాకుండా ఇవ్వనందుకు సిబ్బందిపై దాడి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజేంద్రనగర్ ఎగ్జిట్ 17 వద్ద టోల్ గేట్ సిబ్బందిపై కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న హుస్సేన్ సిద్ధిఖీ దాడికి పాల్పడ్డాడు. అతను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నట్లుగా తెలిసింది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగిన కారణంగానే ఆ ప్రభుత్వ అధికారితో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా, తన కారుకు టోల్ మినహాయింపు ఇవ్వాలని హుస్సేన్ సిద్ధిఖీ హుకుం జారీ చేసినట్లు తెలిసింది.

అయితే.. టోల్ మినహాయింపు లేకపోవడంతో డబ్బులు చెల్లించాల్సిందేనని టోల్ సిబ్బంది కోరగా.. దానికి అంగీకరించని ప్రభుత్వ అధికారి ఆగ్రహంతో సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. టోల్ గేట్ వద్దకు ప్రభుత్వ అధికారికి సంబంధించిన కారు రాగానే ఆ వాహనం ఆపినందుకు టోల్ సిబ్బందిపై ఆగ్రహంతో ప్రభుత్వ ఉద్యోగి అతని కుటుంబ సభ్యులు దాడికి దిగారు.

ఈ క్రమంలో గొడవను అడ్డుకోబోయిన ఇతర టోల్ సిబ్బందిపై కూడా దాడికి పాల్పడినట్లు అక్కడి సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. తమకు ఉన్న పరిధి మేరకే ప్రవర్తించామని, టోల్ రూల్స్ అతిక్రమించి ఏం చేసినా తమ ఉద్యోగాలకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఏ ప్రభుత్వ అధికారికి అయినా టోల్ నిబంధనలు అతిక్రమించి మినహాయింపు ఇచ్చే అధికారం తమ చేతుల్లో లేదని అంటున్నారు. ఈ మేరకు తమపై ఇష్టారీతిన దాడికి పాల్పడిన జూనియర్ అసిస్టెంట్‌ హుస్సేన్ సిద్ధిఖీతో పాటు అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..