Hyderabad: 2030 నాటికి 200 మిలియన్ ఎస్‌ఎఫ్‌టి కమర్షియల్ స్పేస్..3లక్షల ఉద్యోగాలే లక్ష్యం!
హైదరాబాద్‌లోపని నానక్‌రాంగూడలో సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ (USA), కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన “సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో స్థాపించిన ఈ కేంద్రంలో ప్రస్తుతానికి 1,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వచ్చే 2–3 సంవత్సరాల్లో ఈ సంఖ్య రెట్టింపు కానుందని మంత్రి తెలిపారు

Telangana: 2030 నాటికి రాష్ట్రంలో 200 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-A కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. మంగళవారం నానక్‌రాంగూడలో సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ (USA), కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన “సిటిజెన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్” ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటిజెన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్‌లో స్థాపించిన ఈ కేంద్రంలో ప్రస్తుతానికి 1,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని… వచ్చే 2–3 సంవత్సరాల్లో ఈ సంఖ్య రెట్టింపు కానుందని మంత్రి తెలిపారు.
గ్లోబల్ బిజినెస్ హబ్‌గా హైదరాబాద్…
హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ హబ్‌గా ఎదుగుతోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ మార్పుతో కమర్షియల్ స్పేస్ డిమాండ్ భారీగా పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో డిమాండ్ తగ్గుతుంటే, హైదరాబాద్‌లో మాత్రం పెరుగుతోందని గుర్తు చేశారు. ఇతర నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో గత ఏడాది 56 శాతం వృద్ధిరేటు నమోదైందని చెప్పుకొచ్చారు. గత ఏడాది రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్‌ను వివిధ కంపెనీలు లీజుకు తీసుకున్నాయని మంత్రి వివరించారు.
హైదరాబాద్‌లో జీసీసీల విస్తరణ..
ప్రస్తుతం నగరంలో 355 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇవి 3 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయన ఆయన తెలిపారు. కేవలం గత ఏడాదిలోనే 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌ను కేవలం జీసీసీ హబ్‌గా మాత్రమే కాకుండా, ఇన్నోవేషన్, R&D, ప్రొడక్ట్ డెవలప్మెంట్ సేవలు అందించే వేదికగా అభివృద్ధి చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. రాష్ట్ర జీడీపీలో తెలంగాణ వాటా 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
పెట్టుబడులపై దుష్ప్రచారాన్ని ఖండించిన మంత్రి…
తెలంగాణను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలనే ఉద్దేశంతో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని… వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…