AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తాః సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తానంటున్న సీఎం రేవంత్.. ఇప్పుడు మరో టూర్ ఫిక్స్ చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కోసం ఏప్రిల్ 15 రాత్రి బెంగుళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం ఆయనతో కలిసి వెళ్తున్నారు.

తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తాః సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy Japan Tour
Follow us
Prabhakar M

| Edited By: Balaraju Goud

Updated on: Apr 15, 2025 | 7:37 PM

తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరి దగ్గరకైనా వెళ్తా.. ఎన్ని పర్యటనలైనా చేస్తానంటున్న సీఎం రేవంత్.. ఇప్పుడు మరో టూర్ ఫిక్స్ చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన కోసం ఏప్రిల్ 15 రాత్రి బెంగుళూరు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం ఆయనతో కలిసి వెళ్తున్నారు .

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా.. 8 రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. ఈ పర్యటన ఏప్రిల్ 16 నుంచి 22 వరకు జరుగనుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి బృందం టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హిరోషిమా నగరాల్లో పర్యటించనున్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. పారిశ్రామిక పెట్టుబడులు, సాంకేతిక సహకారం తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. జపాన్‌లో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. రాష్ట్ర అభివద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరనున్నారు.

ఏప్రిల్ 16న సీఎం బృందం నారిటా ఎయిర్‌పోర్ట్ ద్వారా జపాన్ చేరుకోనుంది. అదే రోజు జపాన్‌లోని భారత రాయబారి తో ఆతిథ్య భేటీ జరుగనుంది. ఏప్రిల్ 17న టోక్యోలోని సోనీ గ్రూప్, జైకా, JETRO, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వంటి ప్రముఖ సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీ సందర్శిస్తారు. ఏప్రిల్ 18న, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి అర్పించిన అనంతరం టోక్యో గవర్నర్ తో ముఖ్యమంత్రి మర్యాదపూర్వక భేటీ అవుతారు. తర్వాత ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతినిధుల సమావేశం, అలాగే టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ వంటి దిగ్గజ సంస్థల సీఈవోలతో భేటీలు జరగనున్నాయి. అనంతరం సుమిదా రివర్ ఫ్రంట్ సందర్శన జరుగుతుంది.

ఏప్రిల్ 19న, టోక్యో నుంచి ఓసాకాకి వెళ్లే మార్గంలో మౌంట్ ఫుజి ప్రాంతాన్ని మరియు అరకురయామా పార్క్‌ను సీఎం బృందం సందర్శించనుంది. ఏప్రిల్ 20న ముఖ్యమంత్రి బృందం కిటాక్యూషు సిటీకి వెళ్లి మేయర్ తో సమావేశమవుతుంది. ఎకో టౌన్ ప్రాజెక్ట్, మురసాకి రివర్ మ్యూజియం, ఎన్విరాన్‌మెంట్ మ్యూజియం, ఎకో టౌన్ సెంటర్ సందర్శన కూడా షెడ్యూల్‌లో ఉన్నాయి. ఏప్రిల్ 21న ఓసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ ప్యావిలియన్ ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం, ఒసాకా రివర్ ఫ్రంట్ సందర్శన జరుగుతుంది.

ఏప్రిల్ 22న, ముఖ్యమంత్రి బృందం హిరోషిమా వెళ్లి పీస్ మెమోరియల్ ను సందర్శించి, గాంధీ విగ్రహానికి పుష్పాంజలి అర్పిస్తారు. తర్వాత హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ చైర్మన్, అలాగే జపాన్–ఇండియా బిజినెస్ చాప్టర్ తో సమావేశాలు నిర్వహిస్తారు. హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని కూడా సందర్శించనున్నారు. ఈ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి బృందం అదే రాత్రి ఓసాకాలోని కాన్సాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి, ఏప్రిల్ 23న ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
ఉత్తమ స్త్రీ లక్షణాలు ఇవే.. వీరుకుటుంబానికి దిశానిర్దేశం చేస్తారట
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారనీ.. తల్లిదండ్రులను చంపిన కొడుకు..!
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
ముంబైతో లక్నో.. ఢిల్లీతో బెంగళూరు.. సూపర్ సండేలో హోరాహోరీ పక్కా
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
శ్రీవారి భక్తులకు ప్రసాదం విక్రయం మొదలు పెట్టారో తెలుసా..
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
రేపట్నుంచి RRB రాతపరీక్షలు షురూ..హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ లింక్ ఇదే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
నేటి మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలి.. ఎందుకంటే
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..
అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం ధర ఎంత ఉందంటే..
UPSC సివిల్స్‌లో గొర్రెలకాపరి కొడుకు సత్తా.. బీరప్ప నువ్ గ్రేటప్ప
UPSC సివిల్స్‌లో గొర్రెలకాపరి కొడుకు సత్తా.. బీరప్ప నువ్ గ్రేటప్ప
వర్షంతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ నుంచి షారుఖ్ ఖాన్ టీం ఔట్?
వర్షంతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ నుంచి షారుఖ్ ఖాన్ టీం ఔట్?
పుచ్చకాయ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా,...
పుచ్చకాయ గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా,...