దుబాయ్‌లో దారుణం.. ఇద్దరు తెలంగాణ యువకులను హతమార్చిన పాక్ యువకుడు!
దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణ వాసులు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్తానీ యువకుడు హత్య చేయడం సంచలనం సృష్టించింది. అయితే.. దుబాయ్‌లో జరిగిన ఈ డబుల్ మర్డర్ కేసులో మతోన్మాదం ఉందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణ వాసులు దారుణ హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపింది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్తానీ యువకుడు హత్య చేయడం సంచలనం సృష్టించింది. అయితే.. దుబాయ్‌లో జరిగిన ఈ డబుల్ మర్డర్ కేసులో మతోన్మాదం ఉందనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి చెందిన శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడ ఓ బేకరీలో పలువురు యువకులతో కలిసి పని చేస్తున్నారు. అదే బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన పలువురు యువకులు ఉండడం ఇద్దరు ప్రాణాలను బలిగొంది. పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. సడెన్‌గా మత పరమైన నినాదాలు చేస్తూ ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డారు. దాంతో.. దుండగుడి చేతిలో ఇద్దరూ మృతి చెందగా.. మరో ఇద్దరు తెలుగువాళ్లు కూడా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించిన దుబాయ్ పోలీసులు.. పాకిస్తాన్‌కు చెందిన హంతకుడిని అరెస్ట్ చేశారు. మతపరమైన దాడుల ఆరోపణల నేపథ్యంలో మరికొందరు పాకిస్తానీయుల కోసం దుబాయ్ పోలీసులు గాలిస్తున్నారు.
అయితే.. మత విద్వేషం కారణంగానే ఈ దుశ్యర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన తర్వాత.. మతపరమైన నినాదాలు చేయడమే అందుకు నిదర్శనం అంటున్నారు బాధిత కుటుంబీకులు. భారత్‌లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత పాకిస్తానీయులు హిందువులపై దాడులు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇక.. దుబాయ్‌లో హత్యకు గురైన తెలంగాణ వాసుల మృతదేహాలను వీలైనంత త్వరగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు.
పాకిస్తాన్ వ్యక్తి కత్తితో పొడిచి చంపినట్లు జై శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. దుబాయిలో తెలంగాణ వాసుల హత్యపై మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీశారు. ప్రేమ్‌సాగర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ఆయన.. విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులతో మాట్లాడి.. డెడ్‌బాడీలను స్వదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..