Hyderabad: హైదరాబాదీస్ అటెన్షన్.! సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్‌ల మూసివేత.. ఇది తెలుసుకోండి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆధునీకరణ పనులు పూర్తి చేసేందుకు 120 రైళ్ల దారి మళ్లింపు చేశారు. ఈ రైళ్లు సికింద్రాబాద్‌కి రాకుండా చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి రానున్నాయి. ఆధునీకరణలో భాగంగా సికింద్రాబాద్‌లో 6 ప్లాట్‌ఫామ్‌లను మూసివేశారు.

కృపయా ధ్యాన్‌దే!.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మీరు ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ మీ కోసమే. ఇకపై మీరు బయలుదేరే స్టేషన్ సికింద్రాబాద్ మాత్రమే కాదు.. వేర్వేరు టర్మినల్స్‌కి మార్చారు. కారణం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరికొత్తగా పునర్నిర్మాణం అవుతోంది. ఎయిర్‌పోర్ట్‌కి ఏమాత్రం తీసిపోకుండా రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా.. రైళ్ల రాకపోకలు మార్చారు అధికారులు.
పునర్నిర్మాణపనుల్లో భాగంగా 26 లిఫ్ట్‌లు, 32 ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించబోతున్నారు. 110 మీ.వెడల్పు, 120 మీ.పొడవుతో భారీ స్కై కాంకోర్స్ నిర్మాణం రూపుదిద్దుకోబోతుంది. అలాగే రిటైల్ ఔట్‌లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్‌లు నిర్మిస్తున్నారు. రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసే క్రమంలో ముందుగా 2, 3, 4, 5 ప్లాట్‌ఫామ్‌లు ఫేజ్‌ల వారీగా మూసివేయనున్నారు. దాదాపు వందరోజుల పాటు ఈ పనులు నాన్‌స్టాప్‌గా జరగనున్నాయి. పనులు పూర్తయ్యాక ఈ నాలుగు ప్లాట్‌ఫామ్‌లు పునఃప్రారంభం కానున్నాయి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి రోజుకి 250 రైళ్లు రాకపోకలు సాగించేవి. వీటిలో కొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. మార్పులు చేసిన ట్రైన్లు ఇకపై సికింద్రాబాద్ కాకుండా చర్లపల్లి, కాచిగూడ, హైదరాబాద్, ఉమ్దానగర్ టర్మినల్‌ల నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి.
ఇకపై చర్లపల్లి నుంచి నడిచే ట్రైన్‌లు 8 కాగా.. మిగతా టెర్మినల్స్‌కి మారినవి 30, చర్లపల్లిలో అదనపు స్టాప్ ఇచ్చినవి 6.. సికింద్రాబాద్ కాకుండా నేరుగా చర్లపల్లికి 32గా ఉన్నాయి. పునర్నిర్మాణం తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే స్టేషన్‌లలో ఒకటిగా మారనుంది. అత్యంత సౌకర్యవంతంగా, క్లీన్‌గా, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించే ప్రాంతంగా మారనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి