AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Conocarpus Trees: పిట్ట కూడా వాలని చెట్టు.. మొక్కే కదా అని పెంచితే..!

కోనో కార్పస్‌...ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న వివాదం. ఈ చెట్లను నాటాలా? నరకాలా? అవి విషవృక్షాలా? కల్పవృక్షాలా? వాటి వాయువు పీలిస్తే...మన ఆయువు తగ్గిపోతుందా? కోనో కార్పస్‌ చెట్ల వల్ల ప్రాణాలకే ప్రమాదం అంటారు కొందరు. ఆ ప్రచారంలో నిజం లేదంటోంది జన చైతన్య వేదిక. దీనిమీద జరుగుతున్న చర్చ, రచ్చ హీట్‌ పెంచుతోంది

Conocarpus Trees: పిట్ట కూడా వాలని చెట్టు.. మొక్కే కదా అని పెంచితే..!
Conocarpus
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 15, 2025 | 8:08 PM

వృక్షో రక్షతి రక్షితః అంటారు. వృక్షాలను సంరక్షిస్తే.. అవే మనల్ని రక్షిస్తాయనేది పెద్దల మాట. కానీ, కోనోకార్పస్‌ చెట్లు మాత్రం ఈ కోవలోకి రావని, అవి యమ డేంజర్‌ అంటున్నారు కొందరు. పచ్చదనం, అందం కోసం రోడ్ల పక్కన, రోడ్ల మధ్యలో.. నాటే ఈ మొక్కలను తెలంగాణ, ఏపీ, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలు నిషేధించాయి. ఈ నేపథ్యంలో కోనో కార్పస్‌ చెట్ల గురించి ప్రజలకు అవగాహన పెంచేందుకు జన చైతన్య వేదిక సమావేశం నిర్వహించింది. వాళ్లు చెబుతున్నట్లు వీటి వల్ల వచ్చే ప్రయోజనాలేమిటో చూద్దాం. కోనోకార్పస్‌ చెట్లను వ్యతిరేకిస్తున్న వాళ్ల వాదన ఏంటో చూద్దాం.

మానవాళికి ప్రమాదకరంగాఉన్న కోనో కార్పస్ చెట్లని నరికివేయాలని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసారు శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు.కోనో కార్పస్ చెట్లు మిగతా చెట్ల కన్నా కూడా అత్యధిక మోతాదులో కార్బన్‌ డయాక్సైడ్ ను తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయని వాళ్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కోనో కార్పస్‌ చెట్లను పరిరక్షించాలన్నారు.దీనికి సంబంధించిన పరిశోధన చిత్రాలను ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కోనో కార్పస్‌ చెట్లపై జరిగిన పరిశోధనలో మానవాళికి ఉపయోగపడే ఫలితాలు వెల్లడయ్యాయని యోగివేమన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ AR రెడ్డి స్పష్టం చేశారు.

ఇక కోనోకార్పస్‌ చెట్లను దెయ్యం చెట్లంటూ విమర్శిస్తున్నారు మరికొందరు. వాటిఐ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ. కోనోకార్పస్‌ చెట్లపై ప్రత్యేకంగా ఒక పాటనే రాశారాయన. కోనోకార్పస్‌ చెట్లతో లాభాలెంత? నష్టాలెంతో వివరిస్తున్నారు. అలాగే, వీటికి ప్రత్యామ్నాయాలేంటో ఆయన చెబుతున్నారు. కోనో కార్పస్‌ చెట్లు భూగర్భ జలాలను ఖాళీ చేయడంతో పాటు, మౌలిక సదుపాయాలను దెబ్బ తీస్తాయన్నారు రిటైర్డ్‌ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ హరి ప్రసాద్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి 

ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
10th ఫెయిలైన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు.. ఎప్పట్నుంచంటే?
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
ఈ 4 పదార్థాలను తింటే.. కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీ తెరుచుకున్నట్లే..
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
మే 1 నుంచి మారనున్న నిబంధనలు.. మీ జేబుపై మరింత భారం!
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే
10th ఫలితాల్లో 2025 అమ్మాయిల సత్తా.. టాప్ ర్యాంకులన్నీ వారివే
యువతి చేసిన పనికి మెగా కోడలు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వీడియో
యువతి చేసిన పనికి మెగా కోడలు తీవ్ర ఆగ్రహం.. షాకింగ్ వీడియో
తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు!
తిరుమల వెంకన్నను దర్శించుకున్న RCB క్రికెటర్లు!
కస్టమర్లకు అలర్ట్‌.. మే 1న బ్యాంకులకు సెలవేనా..?
కస్టమర్లకు అలర్ట్‌.. మే 1న బ్యాంకులకు సెలవేనా..?