ధరణిలో లేనిదేంటి..? భూభారతిలో ఉన్నదేంటి? అన్ని వివాదాలకు ఇస్తుందా చెల్లుచీటీ?
కేసీఆర్ మానస పుత్రికల్లో ఒకటైన ధరణి పోర్టల్, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ధరణి పోర్టల్.. ధరణి పోర్టల్‌ని సూపర్ పాపులర్ స్కీమ్‌గా మారిపోయింది. కానీ.. నిర్వహణా లోపాలు, అవకతవకలు, కొందరి చేతివాటం.. అన్నీ కలిపి ధరణి చట్టాన్ని అత్యంత వివాదాస్పదంగా మార్చేశాయి. దాన్నే ఆసరాగా చేసుకుని, ధరణికి ప్రత్యామ్నాయం పేరుతో జనంలోకెళ్లి రాజకీయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కొట్టింది. అధికారంలోకి వచ్చీరాగానే కోదండరెడ్డి నేతృత్వంలో కమిటి వేసి.. ధరణిలో లొసుగుల్ని పసిగట్టి.. కొత్త చట్టం భూభారతి రూపకల్పనకు నడుంకట్టింది రేవంత్ సర్కార్.

తెలంగాణ ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. నాడు కుమురం భీం ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరాటం చేసినా.. నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటం చేసినా భూమితో వారికున్న అనుబంధం నుంచి పుట్టుకొచ్చినవే. ఆ పోరాటాల నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భావించారు. భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బూర్గుల రామకృష్ణారావు దగ్గరి నుంచి పీవీ నరసింహారావు వరకు చేపట్టిన భూసంస్కరణలే గుర్తుకొస్తాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణి పోర్టల్, కేసీఆర్ మానస పుత్రికల్లో ఒకటైన ధరణి పోర్టల్, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ధరణి పోర్టల్.. ఆ తర్వాత ఓడలు బండ్లయ్యి బండ్లు ఓడలయ్యి ప్రభుత్వం మారడంతో గత పాలకులు భయపడినట్టు నిజంగానే బంగాళాఖాతంలో కలిసిపోయింది. సర్కారువారి భూహక్కు చట్టం అడ్డంగా నేలమట్టమైంది. దాని స్థానంలో కొత్తగా వచ్చింది భూభారతి చట్టం. భూములకు సంబంధించి సర్వకాల సర్వావస్థలకు చెక్ పెడుతూ, వ్యవసాయ భూముల్ని డిజిటలీకరించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం డిజైన్ చేసిన ధరణి పోర్టల్.. 2020 అక్టోబర్ 29న మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది. తెలంగాణ మొత్తం భూభాగం 2 కోట్ల 75 లక్షల ఎకరాలైతే.. అందులో...