పాకిస్థానీ చేతిలో ఇద్దరు తెలంగాణ వాసుల హత్య.. కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి విదేశాంగ శాఖ
దుబాయ్‌లో ఓ పాకిస్థానీ యువకుడి చేతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వారు పనిచేస్తున్న బేకరీలోనే అతి దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించి విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు.

దుబాయ్‌లో ఓ పాకిస్థానీ యువకుడి చేతిలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. వారు పనిచేస్తున్న బేకరీలోనే అతి దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించి విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని మృతదేహాలను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు.
దుబాయ్‌లో తెలంగాణకు చెందిన ఇద్దరు తెలుగు యువకులు నిర్మల్ జిల్లాకు చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దారుణ హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడనని తెలిపారు. మృతుల కుటుంబాలకు పూర్తి మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి, మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని విదేశాంగ శాఖ కార్యాలయ అధికారులకు సూచించారు. ఈ విషయంలో కేంద్రమంత్రి జైశంకర్ ఇచ్చిన మద్దతు, సహాయానికి మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Deeply shocked by the brutal killing of two Telugu youth from Telangana in Dubai, Ashtapu Premsagar from Nirmal Dist. and Srinivas from Nizamabad Dist.
Spoke to Hon’ble External Affairs Minister Shri @DrSJaishankar ji on the matter and he has assured full support to the bereaved…
— G Kishan Reddy (@kishanreddybjp) April 15, 2025
తెలంగాణకు చెందని ఇద్దరు వ్యక్తులు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అయితే వారు పని చేస్తున్నచోటే ఓ పాకిస్థానీ యువకుడు ఇద్దరిని కత్తితో పొడిచి చంపడం కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా సోన్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ సాగర్(40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దుబాయ్ లోని ఓ బేకరీలో పనిచేస్తు్న్నారు. అదే బేకరీలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ యువకుడు మతవిద్వేషంతో వీరిద్దరిని అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగు వ్యక్తులు గాయపడిట్లు తెలుస్తోంది. గత శుక్రవారం(ఏప్రిల్ 11) ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ యువకులపై జరిగిన దాడిని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర ఖండించారు. ఈ విషయంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు కిషన్ రెడ్డి లేఖ రాశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థనపై విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే స్పందించారు. దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులు.. ‘బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్’ను సందర్శించి కేసు వివరాలను తెలుసుకున్నారు. ఏప్రిల్ 11, 2025 నాడు ఈ ఘటనకు సంబంధించి.. ఉద్దేశపూర్వక హత్య కేసుగా నమోదు చేసినట్ల స్థానిక పోలీసులు భారత ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. మోడ్రన్ బేకరీలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ వ్యక్తి.. ఇద్దరు తెలంగాణ వ్యక్తులను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనలో మరో ఇద్దరిని గాయాలైనట్లు భారత కాన్సులేట్ అధికారులకు పోలీసులు వివరించారు. ఆ వెంటనే మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలని భారత కాన్సులేట్ అధికారులు.. అక్కడి విచారణాధికారులకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..