Viral Video: ఓయమ్మనే… ఇదేమి హ్యాబి తల్లోయ్… ఇసొంటి అలవాటు నేనేడా చూడలే!
సమాజంలో మన చుట్టూ ఉండే మనుషుల అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు ఒక్కొక్కరివి ఒక్కో విధంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కొంతమందికి రకరకాల హ్యాబిట్స్ అలవడుతుంటాయి. పోస్టల్ స్టాంపులు, పాత నాణేలు సేకరించడం, పురాతన వస్తువులను కలెక్ట్ చేయడం వంటి హ్యాబిట్స్ వంటి అభిరుచులు గల...

సమాజంలో మన చుట్టూ ఉండే మనుషుల అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు ఒక్కొక్కరివి ఒక్కో విధంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కొంతమందికి రకరకాల హ్యాబిట్స్ అలవడుతుంటాయి. పోస్టల్ స్టాంపులు, పాత నాణేలు సేకరించడం, పురాతన వస్తువులను కలెక్ట్ చేయడం వంటి హ్యాబిట్స్ వంటి అభిరుచులు గల వ్యక్తులను మనం చూసే ఉంటాం. పైగా వారు సేకరించిన వస్తువలను జాగ్రత్తగా భద్రపరిచి ఎగ్జిబిషన్ రూపంలో బయటి ప్రపంచానికి ప్రదర్శించి సంతోషపడతారు. అయితే ఇక్కడ మాత్రం ఓ అమ్మాయి ఓ విచిత్రమైన అలవాటుతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
సమాజంలో కొంతమందిని చూస్తుంటే.. వాళ్లకు మతి ఉందా? లేదా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. పిచ్చి పలు రకాలు అన్న డైలాగుకు ఈ యువతి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆమె హాబీ ఏంటో తెలిస్తే.. మీరు నోరెళ్ల బెడతారు. ఇదేం పిచ్చి తల్లీ అని అనకమానరు. ఆ యువతి హ్యాబీ ఏమిటంటే దోమల్ని చంపి, వాటితో ఓ ఆల్బమ్ తయారు చేయడం. యస్.. మీరు చదువుతుంది నిజమే.. దోమలను చంపి వాటితో ఆ ఆల్బమ్ తయారు చేస్తుంది.
ఆ ఆల్బమ్‌లో తాను చంపిన దోమల్ని అతికించి.. ఆ దోమకో పేరు పెడుతుంది. దోమను ఏ సమయంలో చంపిది, ఎక్కడ చంపిందో వివరంగా ఆల్బమ్‌లో రాసుకుంటోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పిచ్చోళ్ల గురించి వినడమే కానీ, ఇదే లైవ్‌లో మొదటి సారి చూడ్డం అంటూ పోస్టులు పెడుతున్నారు. బంగారు తల్లీ .. చక్కగా చదువుకోవచ్చుగా.. ఇలా దోమల్ని చంపే పనేంటి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తే ఆ అమ్మాయిని వెంటనే డాక్టర్‌కు చూపించండి అంటూ కామెంట్ల రూపంలో సలహాలు ఇస్తున్నారు.
వీడియో చూడండి:
View this post on Instagram