‘మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్-2025’ విజేతగా రికార్డ్ సృష్టించిన అనురాధ గార్గ్.. ఎవరో తెలుసా..?
మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ పోటీ అనేది వివాహిత మహిళలు పాల్గొనే అంతర్జాతీయ అందాల పోటీ. ఈసారి మిసెస్ ఇండియా గ్లోబ్ 2024గా ఎంపికైన అనురాధ గార్గ్ భారతదేశం నుండి ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో అందంతో పాటు, మహిళల వ్యక్తిత్వం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణం ఆధారంగా పోటీదారులను నిర్ణయిస్తారు.

గురుగ్రామ్‌కు చెందిన అనురాధ గార్గ్ చైనాలో జరిగిన ‘మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025’ పోటీలో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఏప్రిల్ 4 నుండి 13 వరకు జరిగిన ఈ పోటీలో 80కి దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం శక్తి, స్ఫూర్తికి అనురాధ గార్గ్ ప్రతినిధిగా నిలిచారు. ఈ గెలుపుతో ఈ టైటిల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా గార్గ్ రికార్డ్ సృష్టించారు. ఈ పోటీ మహిళల వ్యక్తిత్వం, తెలివితేటలు మరియు ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేస్తుంది.
మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ పోటీ అనేది వివాహిత మహిళలు పాల్గొనే అంతర్జాతీయ అందాల పోటీ. ఈసారి మిసెస్ ఇండియా గ్లోబ్ 2024గా ఎంపికైన అనురాధ గార్గ్ భారతదేశం నుండి ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో అందంతో పాటు, మహిళల వ్యక్తిత్వం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణం ఆధారంగా పోటీదారులను నిర్ణయిస్తారు.
అనురాధ గార్గ్ గురుగ్రామ్ కు చెందినవారు. సోషల్ మీడియాలో ఆమెను అనురాధ కపూర్ అని పిలుస్తారు. ఇప్పటివరకు ఆమె అనేక బ్యాంకులు, పలు బీమా కంపెనీలలో పనిచేశారు. 2024లో, ఆమె మిసెస్ ఇండియా గ్లోబ్ అవార్డ్‌ను అందుకున్నారు. తన కెరీర్‌తో పాటు, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆమె ప్రత్యేక దినచర్యను అనుసరిస్తారు.. అనురాధకు డ్యాన్స్ చేయడం, ప్రయాణం అంటే ఇష్టమని చెప్పారు.. ఆమె తన దినచర్యలో యోగా, ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది తన మానసిక, శారీరక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుందని అనురాధ చెప్పుకొచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..