AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: తీవ్రమైన భూకంపం అలర్ట్‌.. ముందుగానే గ్రహించిన ఏనుగులు ఏం చేశాయంటే..

జూలో భిన్నమైన దృశ్యం కనిపించింది. జూలోని ఆఫ్రికన్ ఏనుగులు భూమి కంపిస్తున్నట్లు గమనించిన వెంటనే, అవి తమ పిల్ల ఏనుగులను రక్షించుకునే పనిలో పడ్డాయి. అందుకోసం ఏనుగులు తమ పిల్లల చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: తీవ్రమైన భూకంపం అలర్ట్‌.. ముందుగానే గ్రహించిన ఏనుగులు ఏం చేశాయంటే..
San Diego Earthquake
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 15, 2025 | 7:24 PM

భూకంపం రాబోతోందని ముందుగా తెలుసుకునేది జంతువులు అని అంటారు. దక్షిణ కాలిఫోర్నియాలో భూకంపం సంభవించినప్పుడు.. శాన్ డియాగో జూలోని ఏనుగుల గుంపు చేసిన పని ఇప్పుడు ఇంటర్ నెట్ లో వేగంగా వైరల్ అవుతోంది. గత సోమవారం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు, ఎస్కోండిడోలోని శాన్ డియాగో జూలో భిన్నమైన దృశ్యం కనిపించింది. జూలోని ఆఫ్రికన్ ఏనుగులు భూమి కంపిస్తున్నట్లు గమనించిన వెంటనే, అవి తమ పిల్ల ఏనుగులను రక్షించుకునే పనిలో పడ్డాయి. అందుకోసం ఏనుగులు తమ పిల్లల చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఏప్రిల్ 14న ఉదయం 10 గంటలకు దక్షిణ కాలిఫోర్నియాలో భూమి కంపించడం ప్రారంభించినప్పుడు, పెద్ద ఏనుగులు ఎండులా, ఉమ్ంగాని, 18 ఏళ్ల ఖోసి వేగంగా స్పందించాయి. తమ మందలోని చిన్న వాటి చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరుచుకున్నాయి. వాటిలో 7 ఏళ్ల జూలీ, మఖాయా కూడా ఉన్నాయి. అవి తమ పిల్లలను రక్షించుకోవడానికి ఒక మందగా కలిసి రావడం, ఆపై ఎవరైనా ఒంటరిగా ఉన్నారా అని చూడటానికి ఆవాసాలను చెక్ చేసుకోవడం నిజంగా ఆసక్తికరంగా కనిపించింది. అని జూ క్యూరేటర్ మిండీ ఆల్బ్రైట్ మీడియాకు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

భూకంపం వస్తుందని ఏనుగుకు ముందుగానే తెలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఏనుగులు తమ పాదాల ద్వారా శబ్దాలను గ్రహించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దక్షిణ కాలిఫోర్నియాను కుదిపేసిన 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో ఏనుగులు హెచ్చరిక వలయం ఏర్పరచుకున్నాయి.. ఈ ప్రవర్తన మందను రక్షించడానికి ఏనుగుల సహజ ప్రతిస్పందనగా వెల్లడించారు.

శాన్ డియాగో జూ వైల్డ్ లైఫ్ అలయన్స్ (@sandiegozoo) ఏప్రిల్ 14, 2025 ఆ నివేదిక ప్రకారం, 2010లో బాజా కాలిఫోర్నియాలో 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో ఏనుగుల మంద కూడా ఇలాంటి ప్రతిచర్యనే చేసింది. ఈ సంఘటన ఏనుగుల తెలివితేటలను తెలియజేస్తుందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..