Watch: ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ముగ్గురు భార్యలు లేచిపోవటంతో.. ఇప్పుడు
బబ్లూ కుమార్ శర్మ జీవితం సినిమా కథను మించి అనిపిస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిన బబ్లూ ఇప్పటివరకు మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. కానీ, ప్రతిసారీ అతనికి ద్రోహం, ఒంటరితనం ఎదురయ్యాయి. మూడుసార్లు వివాహం చేసుకున్నప్పటికీ అతని భార్యలు ఎవరూ అతనితో ఎక్కువ కాలం ఉండలేదు. అతని మూడవ భార్య పెళ్లైన ఒక్క రోజుకే తన ప్రియుడితో లేచిపోయింది.

వివాహం అనేది వధూవరులు ఏడేడు జన్మల పాటు కలిసి ఉండాలని ప్రమాణాలు చేసుకునే ఒక పవిత్ర బంధం. అది సుఖమైనా, దుఃఖమైనా భార్యాభర్తలు ప్రతి క్షణంలో ఒకరికొకరు కవచంగా నిలుస్తారు. కానీ, ఆ సహచరుడు మిమ్మల్ని మధ్యలో వదిలేస్తే.. ఇంతకంటే బాధాకరమైనది మరొకటి ఉండదు. బీహార్ కు చెందిన ఒక వ్యక్తి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. బీహార్‌కు చెందిన బబ్లూ కుమార్ హృదయం ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు ముక్కలైంది. అతను మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. కానీ అతని ముగ్గురు భార్యలు పెళ్లైన రెండు నెలల్లోనే అతన్ని విడిచిపెట్టడంతో ఆ మూడు పెళ్లిళ్లు మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలాయి. పూర్తి వివరాల్లోకి వెళితే…
బీహార్‌లోని జముయ్ జిల్లాలోని మలయ్‌పూర్ బస్తీలో నివసించే బబ్లూ కుమార్ శర్మ జీవితం సినిమా కథను మించి అనిపిస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిన బబ్లూ ఇప్పటివరకు మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. కానీ, ప్రతిసారీ అతనికి ద్రోహం, ఒంటరితనం ఎదురయ్యాయి. మూడుసార్లు వివాహం చేసుకున్నప్పటికీ అతని భార్యలు ఎవరూ అతనితో ఎక్కువ కాలం ఉండలేదు. అతని మూడవ భార్య పెళ్లైన ఒక్క రోజుకే తన ప్రియుడితో లేచిపోయింది.
2022 సంవత్సరం ప్రారంభంలో బబ్లు మొదటిసారి వివాహం చేసుకున్నాడు. కానీ రెండు నెలల తర్వాత అతని భార్య అతన్ని వదిలేసింది. ఆ తర్వాత జూన్ 2023లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈసారి అంతా బాగానే ఉంటుందని భావించాడు. కానీ, కేవలం ఒకటిన్నర నెలల్లోనే అతని రెండవ భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ తరువాత డిసెంబర్ 2, 2023న బబ్లూ మూడోసారి వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత బబ్లూ తన నవ వధువును ఇంటికి తీసుకువచ్చినప్పుడు, అతని కొత్త భార్య మేకప్ కిట్ కోరిందట. అది కొనడానికి మార్కెట్‌కి వెళ్ళమని చెప్పింది.. కానీ బబ్లు మేకప్ కిట్‌తో తిరిగి వచ్చేసరికి ఆమె తన ప్రియుడితో పారిపోయిందని తెలిసింది.
మూడు పెళ్లిళ్ల తర్వాత కూడా బబ్లూ కుమార్ పట్టు వదలలేదు. ఇప్పుడు అతను నాలుగో పెళ్లికి రెడీగా ఉన్నాడు. ఏదో ఒక రోజు తనకు మద్దతు ఇచ్చే వ్యక్తి దొరుకుతుందని అతను ఆశిస్తున్నాడు. బబ్లూ వృత్తిరీత్యా వడ్రంగి అని తెలిసింది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
అయితే, బబ్లూ కథకు సంబంధించిన వీడియో @mewsinsta అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది. ఈ రీల్ ఇప్పటివరకు దాదాపు 50 వేల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది. బబ్లూ కుమార్ మూడు పెళ్లిళ్లు ముక్కలైన విషయం సోషల్ మీడియా వినియోగదారులను నిజంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది చూసిన నెటిజన్లు చాలా మంది రకరకాలుగా స్పందించారు. ‘బబ్లూ భాయ్ మీకు నిజంగా ధైర్యం చాలా ఎక్కువ అంటూ ఒకరు రాయగా, ఇది పెళ్లా లేక యుపిఎస్‌సి పరీక్షనా..? బ్రో అంటూ ఇంకొకరు వ్యాఖ్యనించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..