2025 Karizma XMR: స్టన్నింగ్ ఫీచర్లో యూత్‌కి పిచ్చెక్కించేస్తున్న కరీజ్మా బైక్.. ధర ఎంతో తెలుసా?
యూత్‌కి మంచి కిక్కిచ్చే న్యూస్ ఇది. ముఖ్యంగా బైక్ లవర్స్‌కి. హీరో కరిజ్మా తన అప్ డేటెడ్ వెర్షన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. 2025 కరిజ్మా ఎక్స్ఎంఆర్ పేరుతో దీనిని ఆవిష్కరించింది. దీనిలో రెండు వేరియంట్లను తీసుకొచ్చింది. వీటిలో అత్యాధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్ లో అందిస్తోంది. ఆకర్షణీయ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ధర కూడా అందుబాటులో ఉంది. మంచి స్పోర్ట్స్ లుక్ లో టాప్ క్లాస్ ఫీచర్లు కోరుకునే వారికి అది తక్కువ ధరలో ఇది ఆప్షన్ అవుతుంది. పూర్తి తెలియాలంటే ఇది చదవండి..

హీరో కరిజ్మా బైక్ కి మన దేశంలో మంచి డిమాండే ఉంది. స్టైలిష్ లుక్, అల్టిమేట్ ఫీచర్లతో యువకులను బాగానే ఆకర్షిస్తుంది. ఈక్రమంలో కంపెనీ కరిజ్మా ఎక్స్ఎంఆర్ బైక్ అప్ డేటెడ్ వెర్షన్ ను లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ కొత్త మోడల్ ను తీసుకొచ్చింది. వాటి పేర్లు ‘టాప్’, ‘కాంబాట్ ఎడిషన్’ . ఇవి రెండూ కూడా స్టాండర్డ్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ కు మించిన యూనిక్ ఫీచర్లతో వచ్చాయి. పాత బేస్ వేరియంట్ ధర రూ. 1.81లక్షలు కాగా.. కొత్త రెండు వేరియంట్ల ధరలు రూ. 1.99లక్షలు, రూ. 2.01లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2025 హీరో కరిజ్మా ఎక్సఎంఆర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
2025 హీరో కరిజ్మా ఎక్సఎంఆర్ ఫీచర్లు..
బేస్ వేరియంట్ కు ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే టాప్, కాంబాట్ ఎడిషన్లకు మాత్రం ముందు వైపు యూఎస్డీ ఫోర్కు, కొత్త టీఎఫ్టీ డిస్ ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీని అందించారు. వీటి సాయంతో ఎస్ఎంఎస్, కాల్ అలర్ట్స్ వీరు డిస్ ప్లేపై చూడొచ్చు. అలాగే బ్యాటరీ స్టేటస్, ఫ్యూయల్ ట్యాంక్ లెవల్, గేర్ పొజిషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటివి కూడా చూడొచ్చు. రైడర్ కంఫర్ట్ కోసం వీటికి డిస్క్ బ్రేకులు ఇచ్చారు. ఇది డ్యూయల్ చానల్ ఏబీఎస్(యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను కలిగి ఉంటుంది. రోడ్డుపై మంచి గ్రిప్ ఇచ్చేందుకు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ను అందిస్తోంది. ఎల్ఈడీ హెడ్ లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్ సెటప్ ను కలిగి ఉంటుంది.
2025 హీరో కరిజ్మా ఎక్సఎంఆర్ ఇంజిన్ సామర్థ్యం..
ఇప్పటి వరకూ ఉన్న ఇంజిన్ నే కొత్త వేరియంట్లకు కూడా హీరో కంపెనీ కంటిన్యూ చేసింది. 210 సీసీ సింగిల్ సిలెండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 25హెచ్పీ, 20ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్ బాక్స్ కు కనెక్ట్ చేసి ఉంటుంది. ఇది 9,250 ఆర్పీఎం వద్ద 20.4 ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.
2025 హీరో కరిజ్మా ఎక్సఎంఆర్ కలర్ ఆప్షన్లు..
‘టాప్’ వేరియంట్ మీకు పసుపు, బ్లాక్, రెడ్ కలర్లలో.. ‘కాంబాట్ ఎడిషన్’ గ్రే అండ్ బ్లాక్, డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ లో అందుబాటులో ఉంది. ఈ కలర్ కాంబినేషన్లు యూత్ కు బాగా ఆకర్షించే అవకాశం ఉంది. అలాగే వీటిలోని ఫీచర్లు, డిజైన్, సేఫ్టీ అన్ని విషయాల్లోనూ ఇది అప్ డేటెడ్ గానే ఉండటంతో మార్కెట్ లో సత్తా చాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి