AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold and Silver Prices Today: నేడు స్వల్పంగా దిగి వచ్చిన పసిడి ధర, అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

భారతీయులు పసిడి ప్రియులు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు వంటి ప్రత్యేక రోజుల్లోనే కాదు ఏ చిన్న సందర్భం వచ్చినా సరే ముందుగా గుర్తుకొచ్చేది బంగారమే. డబ్బులు ఎప్పుడు చేతిలో ఉన్నా బంగారం కొనాలని కోరుకుంటారు. అంతగా పసిడి మన జీవితాలతో ముడిపడిపోయింది. బంగారం నగలు కొనుగోలుకు మాత్రమే కాదు పసిడిని మంచి పెట్టుబడిగా కూడా భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పసిడికి వెండి భారీ డిమాండ్ నెలకొంది. దీంతో బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరుకుంటారు. ఈ రోజు (ఏప్రిల్ 15వ) మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold and Silver Prices Today: నేడు స్వల్పంగా దిగి వచ్చిన పసిడి ధర, అదే బాటలో వెండి.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Apr 15, 2025 | 6:48 AM

Share

బంగారం ధరలు రోజురోజుకీ మారుతున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో గందరగోళం నెలకొంటుంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఉంటాయి. మన దేశంలో బంగారం, వెండి ధరలు కూడా ప్రపంచంలో ఉన్న బంగారం ధరలపై మాత్రమే కాదు ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో ఆధారపడి ఉంటాయి. ఈ రోజు విలువైన బంగారం, వెండి ధరలు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే…

  1. హైదరాబాద్ లో పసిడి ధర సోమవారం వలెనే మంగళ వారం కూడా కొంత మేర దిగి వచ్చింది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,540 ఉండగా.. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 95,500లుగా కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగురాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, పొద్దుటూరులలో కొనసాగుతున్నాయి.
  2. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధర మంగళవారం కొంత మేర దిగి వచ్చాయి. ఈ నేపధ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే
  3. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 87,690గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,650లుగా ఉంది.
  4. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 87,540వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 95500 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 87540వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 95500 వద్ద కొనసాగుతోంది. ఇవే ధరలు కేరళ, బెంగలూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.

ఈ రోజు వెండి ధర

బంగారం తర్వాత వెండి ప్రాచీన కాలం నుంచి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. దీనిని ఆభరణాలు, నాణేలు, వంటపాత్రల తయారీ కోసం ఉపయోగిస్తారు. ఈ రోజు వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు, రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. ఈ మ‌ధ్య వివాహ వేడుక‌ల్లో సైతం బంగారం త‌ర్వాత వెండికే ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. ఈ నేపధ్యంలో వెండి కొనేముందు మార్కెట్ ధ‌రలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవ‌డం ముఖ్యం. ఈ రోజు వెండి బంగారం బాటలో నడుస్తూ కొంత మేర దిగి వచ్చింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండికి వంద రూపాయలు మేర దిగి వచ్చి ఈ రోజు 1,09,800లు గా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత?
సింగపూర్‌లో భారతీయ 100 రూపాయల విలువ ఎంత?
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..