KFC Toothpaste: చికెన్ లవర్స్ కోసం ఓ టూత్ పేస్ట్.. ఇదే దీని స్పెషాలిటీ.. ఎగబడి కొంటున్న జనం..
ఇప్పటివరకు మీరు రకరకాల టూత్ పేస్టులను వాడుంటారు. ముఖ్యంగా లవంగం నూనె, ఉప్పు వంటివాటితో తయారు చేసినవి మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ, ఎప్పుడూ ఆరోగ్యమేనా టూత్ పేస్టులో రుచి కూడా ఉండాల్సిందే అని కేఎఫ్‌సీకి ఓ కొత్త ఐడియా వచ్చింది. దీంతో వెంటనే తమ ఫ్రైడ్ చికెన్ రెసిపీని వాడి టూత్ పేస్టునే తయారు చేసేసింది. దీన్ని మార్కెట్లో విడుదల చేయడంతో చికెన్ లవర్స్ షాకింగ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.

ఫ్రైడ్ చికెన్ రుచితో టూత్‌పేస్టా అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది నిజమే. ఆస్ట్రేలియా డెంటల్ బ్రాండ్ హిస్‌మైల్‌తో కలిసి కేఎఫ్‌సీ సంస్థ ఈ వినూత్న ఉత్పత్తిని రూపొందించింది. దీనిలో కేఎఫ్‌సీ వారి ప్రత్యేక 11 మసాలాల మిశ్రమంతో దీన్ని స్పెషల్ గా తయారు చేశారట. ఇంకేముంది నోట్లో పెట్టుకోగానే చికెన్ తిన్న అనుభూతిని ఇస్తుందట. దీన్ని లాంచ్ చేసిన 48 గంటల్లోనే జనాలు దీన్ని ఎగబడి కొనుక్కుంటున్నారు. కేవలం 13 డాలర్ల ధరతో హిస్‌మైల్ వెబ్‌సైట్‌లో విడుదలైన ఈ టూత్‌పేస్ట్ ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకు ఇంత క్రేజ్
ఈ టూత్‌పేస్ట్ విడుదలైనప్పుడు చాలామంది దీన్ని ఏప్రిల్ ఫూల్ జోక్ అనుకున్నారు. కానీ కేఎఫ్‌సీ “ఇది నిజం, ఇది ఫింగర్ లిక్కిన్ గుడ్” అని సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ వింత రుచి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. “బ్రష్ చేస్తుంటే చికెన్ తిన్నట్టు ఉంది!” అని ఒక యూజర్ రాస్తే, మరొకరు “నోటిలో గ్రీజ్ రుచి మిగిలింది” అని ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ టూత్‌పేస్ట్ ఫ్లోరైడ్ లేనిది, దీర్ఘకాల దంత ఆరోగ్యాన్ని అందిస్తుందని చెబుతున్నారు.
ఎలా వాడాలి
ఈ టూత్‌పేస్ట్‌ను సాధారణ బ్రష్‌తో వాడొచ్చు. బ్రష్ చేస్తుంటే కేఎఫ్‌సీ చికెన్ రుచి నోటిని నింపుతుంది, కానీ చివర్లో నీటితో కడిగితే శుభ్రమైన ఊపిరి మిగులుతుంది. హిస్‌మైల్ ఈ ఉత్పత్తిని “బోల్డ్, ఫన్” అని పిలిచింది. దీన్ని కొనలేకపోయినవారి కోసం 59 డాలర్లకు కేఎఫ్‌సీ బ్రాండెడ్ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ కూడా అందుబాటులో ఉంది, ఇందులో మూడు క్లీనింగ్ మోడ్‌లు, సాఫ్ట్ బ్రిస్టల్స్ ఉన్నాయి.
ఇంకా ఏముంది
కేఎఫ్‌సీ ఇంతకు ముందు కూడా వింత ఉత్పత్తులతో ఆశ్చర్యపరిచింది. ఈ టూత్‌పేస్ట్ కూడా ఒక సరదా ఆలోచన అని తెలిపింది. ఇది అమ్ముడైపోయినా, సోషల్ మీడియాలో దీని గురించి చర్చలు ఇంకా జోరుగా సాగుతున్నాయి. కేఎఫ్‌సీ రుచిని బ్రష్‌లోకి తెచ్చిన ఈ ప్రయత్నం, నిజంగా ఒక సరికొత్త అనుభవం అని కేఎఫ్‌సీ లవర్స్ అంటున్నారు.
చిన్న జాగ్రత్త
టూత్‌పేస్ట్ కొన్నవాళ్లు సరదాగా వాడొచ్చు, కానీ ఇది ఫ్లోరైడ్ లేనిది కాబట్టి, దంత ఆరోగ్యం కోసం డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.