AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కంటే విలువైనవి.. కోటీశ్వరులే తినగల అత్యంత ఖరీదైన ఆహారపదార్థాలు ఇవీ

మనకు తెలిసిందల్లా బంగారం ఒక్కటే చాలా ఖరీదైనదని. కానీ ప్రపంచంలో కొన్ని ఆహార పదార్థాలు కూడా బంగారాన్ని మించిన ధరకు అమ్ముడవుతున్నాయి. ఇవి సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండవు. రుచికి ప్రత్యేకత ఉండడం, చాలా అరుదుగా లభించడం వల్ల వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విలువైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V

|

Updated on: Apr 15, 2025 | 4:57 PM

కుంకుమపువ్వు వంటల్లో వాడే సుగంధ ద్రవ్యం. ఇది ఎక్కువగా కాష్మీర్, ఇరాన్ ప్రాంతాల్లో పండుతుంది. ఇది చాలా తక్కువ పరిమాణంలో లభిస్తుంది. కొన్ని వందల పువ్వుల నుండి ఒక్క గ్రాము సాఫ్రాన్ రావడమే దీని ఖరీదుకు కారణం. ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా.. వంటకాలకు మంచి సువాసనను ఇస్తుంది.

1 / 8
మాట్సుటేక్ పుట్టగొడుగులు జపాన్‌లో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. ఇవి చలికాలంలో మాత్రమే పెరుగుతాయి. పచ్చిగా తినొచ్చు, వండితే కూడా రుచిగా ఉంటుంది. ఇది మామూలుగా దొరకడం కష్టం కాబట్టి చాలా రేటు ఉంటుంది.

2 / 8
కేవియర్ అనేది చేపల గుడ్లతో తయారయ్యే ప్రత్యేకమైన ఆహారం. ఇందులో బెలూగా కేవియర్ అనే రకం చాలా ఖరీదైనది. ఇది ముఖ్యంగా స్టర్జన్ అనే చేపల గుడ్లతో తయారవుతుంది. దీని కిలో ధర లక్షల్లో ఉంటుంది. రుచిలోనూ, నాణ్యతలోనూ ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

3 / 8
బ్లూఫిన్ ట్యూనా.. ఈ చేప జపాన్‌లో చాలా ప్రాచుర్యం పొందింది. సుషీ, సాషిమీ వంటి వంటకాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మామూలుగా ఈ చేప పెద్దదిగా ఉండడం వల్ల దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. కొన్నిసార్లు వేలంపాటల్లో దీని ధరలు కోట్ల రూపాయలకు చేరుతాయి.

4 / 8
ఎల్విష్ హనీ అనే తేనె రకం నల్ల సముద్రం ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. ఈ తేనె చాలా స్వచ్ఛంగా, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. దీని రుచి, సువాసన ప్రత్యేకమైనవి. అందుకే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

5 / 8
వైట్ ట్రఫుల్స్ అనేవి భూమిలో పెరిగే సుగంధ పుట్టగొడుగులు. వైట్ ట్రఫుల్స్ అధికంగా ఇటలీ, స్లోవేనియా ప్రాంతాల్లో లభిస్తాయి. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. వాసనలో, రుచిలో ఇవి చాలా బాగుంటాయి కాబట్టి ఖరీదైన రెస్టారెంట్లలో మాత్రమే వీటిని వాడుతారు.

6 / 8
ఇబెరికో హామ్ అనే మాంసం స్పెయిన్ దేశానికి ప్రత్యేకమైనది. ఇది బ్లాక్ ఇబెరియన్ పందిపిల్లల నుండి తయారవుతుంది. వీటిని ప్రత్యేకమైన ఆహారంతో పెంచి చాలా రోజుల పాటు ఎండబెట్టి తయారు చేస్తారు. దీని రుచి చాలా బాగుంటుంది. నోటిలో వేసుకుంటే కరిగేలా ఉంటుంది.

7 / 8
కోబ్ బీఫ్ అనేది జపాన్‌లో పెరిగే వాగ్యు జాతి పశువుల మాంసం. ఈ పశువులను ప్రత్యేకంగా పెంచి మంచి ఆహారాన్ని ఇవ్వడంతో దీని మాంసం నిగనిగలాడే కొవ్వుతో నిండుగా ఉంటుంది. ఇది చాలా రుచికరంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ఆహార పదార్థాలన్నీ రుచిలో ప్రత్యేకతతో పాటు చాలా అరుదుగా లభిస్తాయి. అందుకే ఇవి బంగారానికి కూడా మించిన విలువను పొందాయి.

8 / 8
Follow us