AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ మనిషి ముఖంలో దాగున్న కుక్కని కనిపిడితే.. మీరు సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్

సోషల్ మీడియాలో చాలా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. అలాంటి చిత్రంలో ఒకటి ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తించే పని పెట్టి.. మీ మెదడులకు వ్యాయామం ఇవ్వగలరు.ఈ పజిల్ చిత్రంలో ఒక కుక్క దాక్కుంది. ఈ పజిల్‌ను పరిష్కరించడానికి కాలపరిమితి పది సెకన్లు మాత్రమే. మీరు ఈ పజిల్‌ను పరిష్కరిస్తే.. సక్సెస్ కు మీరే కేరాఫ్ అడ్రస్ అన్నమాట.

Optical Illusion: మీ మనిషి ముఖంలో దాగున్న కుక్కని కనిపిడితే.. మీరు సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్
Optical IllusionImage Credit source: Instagram
Surya Kala
|

Updated on: Oct 23, 2025 | 11:40 AM

Share

కొంతమందికి పజిల్స్ పరిష్కరించడం చాలా సులభమైన పని. మరికొందరికి అలాంటి పజిల్స్ ను చేధించడం అసాధ్యంగా భావిస్తారు. వాటి వైపు తిరిగి చూడరు. అయితే వాస్తవానికి ఇలాంటి పజిల్ గేమ్స్ మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. మీరు ఎంత తెలివైనవారైనా.. మీ చూపులో పదును ఎంత అని తెలియజేస్తాయి. వాస్తవంగా పజిల్స్ మీ కళ్ళను మోసం చేస్తాయి… కానీ మీ మెదడుకు పదును పెడతాయి. ఇప్పుడు ఒక గమ్మత్తైన ఆప్టికల్ భ్రమ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు దానిని చూసిన వెంటనే.. గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడి కనిపిస్తాడు. అయితే ఈ మనిషి ముఖం మధ్య ఒక పెంపుడు కుక్క దాగి ఉంది. మీరు పది సెకన్లలోపు ఈ జంతువును కనుగొనగలిగితే.. మీరు చాలా చురుకైనవారని సక్సెస్ కు మీరే కేరాఫ్ అడ్రస్ స్పష్టమవుతుంది.

ఈ చిత్రంలో ఏముందో చూడండి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ ని @fortbendmd ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఇది చూడడానికి చాలా గమ్మత్తైనది. మొదటి చూపులో ఈ చిత్రంలో గడ్డం ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. అది కూడా ఈ వ్యక్తి కళ్ళు మూసుకుని.. ఆలోచనలో మునిగి ఉన్నట్లు కనిపిస్తాడు. అయితే ఇక్కడ సవాలు ఏమిటంటే, గడ్డం ఉన్న వ్యక్తి ముఖంలో ఒక కుక్క దాక్కుని ఉంది. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను మీరు పది సెకన్లలోపు గుర్తించాలి. ఈ చిత్రాన్ని నిశితంగా పరిశీలించి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి.

మీరు ఖచ్చితమైన సమాధానం చెప్పగలిగారా

గడ్డం ఉన్న వ్యక్తి ముఖం మధ్య దాగి ఉన్న కుక్కను గుర్తించడానికి మీరు మీ ఆలోచనా తీరుని మార్చుకోవాలి. ఈ చిత్రంలోని ప్రతి భాగాన్ని జూమ్ చేయడం ద్వారా సమాధానం కనుగొనడానికి ప్రయత్నించండి. దగ్గరగా చూసిన తర్వాత కూడా మీకు కుక్క కనిపించలేదా? అలా అయితే, మీ మొబైల్ ఫోన్‌ను తలక్రిందులుగా తిప్పండి.. మీకు ఎముకని చేతిలో పట్టుకుని ఉన్న కుక్క కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి
Optical Illusion 1

Optical Illusion 1

మరిన్ని వైరల్ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి