AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందం, ఫ్యాషన్ అంటూ టైట్ దుస్తులు ధరిస్తున్నారా.. ఎన్ని ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..

కొంతమంది బిగుతుగా ఉండే దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. వ్యాయామం, యోగా వంటి సమయాల్లో మాత్రమే కాదు.. తరచుగా బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తారు. అయితే ఇలా బిగుతుగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో మీకు తెలుసా..

అందం, ఫ్యాషన్ అంటూ టైట్ దుస్తులు ధరిస్తున్నారా.. ఎన్ని ఆరోగ్య సమస్యలకు వెల్కమ్ చెబుతున్నారో తెలుసా..
Health Effects Of Tight Clothing
Surya Kala
|

Updated on: Oct 23, 2025 | 10:42 AM

Share

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాషన్ పట్ల మక్కువ పెంచుకుంటున్నారు. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించడానికి ప్రజలు వివిధ రకాల దుస్తులు ధరిస్తున్నారు. కొంతమంది వదులుగా ఉండే దుస్తులను ఇష్టపడతారు.. మరికొందరు శరీరాకృతికి సరిపోయే దుస్తులను ఇష్టపడతారు. ముఖ్యంగా ఫిట్టెడ్ జీన్స్, లెగ్గింగ్స్, బాడీకాన్ డ్రెస్సులు లేదా స్ట్రెచబుల్ టాప్స్ వంటి వాటిని ధరించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అవి స్టైలిష్‌గా కనిపిస్తాయి. అయితే ఇలా ఎక్కువసేపు టైట్ దుస్తులు ధరించడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని మీకు తెలుసా? అవును.. ఇది కొంచెం వింతగా అనిపించినా నిజం.

ఉద్యోగానికి పనికి, లేదా కాలేజీకి బిగుతుగా ఉండే దుస్తులు ధరించి వెళ్ళే అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో చేసిన పరిశోధనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ పరిశోధన ఆధారంగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం ఆరోగ్యానికి ఎలా హానికరమో తెలుసుకుందాం..

పరిశోధన ఏం చెబుతోంది? హెల్త్‌లైన్ ప్రకారం బిగుతుగా ఉండే దుస్తులు సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే వాటిని ధరించే సమయంలో అసౌకర్యం కలిగితే.. రు చాలా బిగుతుగా దుస్తులు ధరిస్తున్నారని అర్ధం. అప్పుడు చర్మం ఎరుపుగా మారడం, చికాకు,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. షేప్‌వేర్, ప్యాంటీహోస్ , బ్రాలు వంటి బిగుతుగా ఉండే లోదుస్తులు చర్మంపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి.

ఇవి కూడా చదవండి

బిగుతుగా ఉండే దుస్తులు ఆరోగ్యానికి హానికరం రిజిస్టర్డ్ డైటీషియన్ మిచెల్ రౌచ్ ప్రకారం నెక్‌టైలు, స్ట్రెచ్ దుస్తులు లేదా బాడీ-ఫిట్ దుస్తులు వంటి బిగుతుగా ఉండే దుస్తులు జీర్ణశయాంతర రుగ్మతలను తీవ్రతరం చేస్తాయి. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల కడుపు , ప్రేగులపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ , గుండెల్లో మంట పెరుగుతుంది. దీర్ఘకాలికంగా నిరంతర యాసిడ్ రిఫ్లక్స్ అన్నవాహిక వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. అప్పుడు ఆహారం మింగడం బాధాకరంగా మారుతుంది. కష్టతరం చేస్తుంది. ఎవరైనా ఉబ్బరంతో బాధపడుతుంటే..గుతుగా ఉండే దుస్తులు ధరిస్తే జీర్ణక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అంతేకాదు బిగుతుగా ఉండే ప్యాంటు, ప్యాంటీహోస్ లేదా షేప్‌వేర్ ధరించడం వల్ల శ్వాస సామర్థ్యం తగ్గుతుంది. వ్యాయామాల సమయంలో చెమట పట్టడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బెల్టులు , న్స్ వంటి బిగుతుగా ఉండే దుస్తులు మెరాల్జియా పరేస్తేటికా అనే వెన్నెముక నరాల కుదింపుకు కారణమవుతాయని.. ఇది తొడ బయటి భాగంలో జలదరింపు, తిమ్మిరి లేదా మంట కారణమవుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

వ్యాయామాలపై బిగుతుగా ఉండే దుస్తుల ప్రభావం టొరంటో విశ్వవిద్యాలయం 2020లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం బిగుతుగా ఉండే వ్యాయామ దుస్తులు మహిళల అథ్లెటిక్ పనితీరును ప్రభావితం చేశాయి. యామం చేసేటప్పుడు బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం తప్పు కాకపోయినా.. అందరికీ సౌకర్యంగా ఉండదు. ఎంపిక మీ ఇష్టం. మీరు మీ వ్యాయామం సమయంలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం సౌకర్యంగా ఉంటే.. దరించ వచ్చు. అయితే ధరించే సమయంలో ఇబ్బంది కలిగే.. అవి చాలా అసౌకర్యానికి గురి చేస్తాయని అంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)