Vastu Tips: ఇంట్లో జెర్రి ఏ రోజున కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా..
ఇంట్లో చీమలు, బొద్దింకలు, జెర్రి వంటి రకరకాల కీటకాలు వస్తూ ఉంటాయి. వీటి బెడద ఎక్కువైతే తగిన నివారణ చర్యలు తీసుకుంటారు. అయితే జెర్రి ఇంట్లో కనిపిస్తే దానికి కొన్ని నమ్మకాలున్నాయి. ఇంట్లో జెర్రి (శతపాదం) కనిపిస్తే శుభమా? అశుభమా అని ఆలోచిస్తారు. అయితే జెర్రి ఇంట్లో కనిపించిన ప్లేస్ బట్టి రోజున బట్టి దానికి సొంత అర్ధం ఉందని జ్యోతిష్కులు చెబుతున్నారు. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఏ రోజున జెర్రిని చూస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం..

జెర్రి, కాళ్ళ జెర్రి లేదా శతపాదం అని పిలబడే ఈ విష పూరిత జీవి ఇంట్లో తరచుగా కనిపిస్తూ ఉంటుంది. అపుడు దీనిని చూడటం శుభమా లేదా అశుభమా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. సంప్రదాయం ప్రకారం జెర్రి కనిపించడం సంపదను (సిరి) సూచిస్తుందనే నమ్మకం విస్తృతంగా ఉంది .. “శతపాదిని చూస్తే సంపద వస్తుంది” అనే సామెత ఉంది.మొత్తం మీద జెర్రి కనిపించడం ఒక శుభ సంకేతం. గేటు, తలుపు, వంటగది, దేవుడి గది, బెడ్ రూమ్ లేదా హాలుతో సహా ఇంట్లో ఎక్కడైనా జరీ కనిపించడం శుభప్రదం. అయితే బాత్రూంలో జెర్రి కనిపించడం అశుభంగా పరిగణించబడుతుంది.
- సోమవారం: జెర్రి ని సోమవారం చూడటం వల్ల దైవిక ఆశీస్సులు లభిస్తాయి. దీనికి రాహు కాలం , అమృత సమయం వంటి విషయాలు పట్టింపు లేవు.
- మంగళవారం: వాహన యోగం, ఆరోగ్యంలో కోలుకోవడం, వివాహ విషయాలలో శుభ ఫలితాలు , భూమి సంబంధిత విషయాలలో ప్రయోజనాలు. ఆర్థిక లాభాలు లేదా బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుదల సూచనలు ఉండవచ్చు.
- బుధవారం: ఉద్యోగంలో మార్పు, జ్ఞానానికి గుర్తింపు. అనుకోకుండా ప్రయాణం లేదా కొత్త విషయాలు వచ్చే అవకాశం ఉంది.
- గురువారం: పోగొట్టుకున్న డబ్బు తిరిగి లభిస్తుంది, ఊహించని ఆర్థిక లాభాలు, పనిలో పదోన్నతి, వ్యాపారంలో లాభం ఉంటుంది. బ్యాంకు రుణాలు వంటి ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
- శుక్రవారం: మీరు దేవుడి ఆశీర్వాదం మీ పై ఉన్నట్లు.. దైవానుగ్రహంతో చేపట్టిన ప్రతి పని పూర్తి అవుతుంది. బహుమతులు, బంగారం కొనడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టే అవకాశాలు కలగవచ్చు.
- శనివారం: చట్టపరమైన విషయాల్లో అనుకూలత, భూ వివాదాలు పరిష్కారమవుతాయి. “సత్యమేవ జయతే” లాగా న్యాయం జరుగుతుందనే సూచన ఉంది.
- ఆదివారం: ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇబ్బందులను ఎదుర్కోవడానికి సంసిద్ధత , ఇతరుల నుంచి మద్దతు లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








