Alcohol Consumption: ఆకలిగా ఉన్నప్పుడు మందు కొడితే ఏమవుతుందో తెలుసా?
What are side effects of drinking alcohol on empty stomach? ఆకలిగా ఉన్నప్పుడు మద్యం తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఈ అలవాటు మునుముందు ఎన్నో ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని చాలా మందికి తెలియదు. మద్యానికి బానిస కావడం వల్ల ఇలాంటి వ్యక్తులు ఆకలిగా ఉన్న సమయంలోనూ..
Updated on: Oct 23, 2025 | 12:30 PM

చాలా మందికి ఆకలిగా ఉన్నప్పుడు మద్యం తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మునుముందు ఎన్నో ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని చాలా మందికి తెలియదు. మద్యానికి బానిస కావడం వల్ల ఇలాంటి వ్యక్తులు ఆకలిగా ఉన్న సమయంలోనూ దీన్నే కడుపుకి పట్టిస్తారు. కాబట్టి కడుపులో ఆహారం లేకుండా మద్యం తాగితే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా మనం ఏదైనా తిన్నప్పుడు లేదా ద్రవం తాగినప్పుడు అది అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వెళుతుంది. ఆ తర్వాత ఆహారం కడుపు, ప్రేగులలో ప్రాసెస్ అవుతుంది. చివరకు ఆహారం రక్త నాళాల ద్వారా రక్తంలోకి శోషించబడుతుంది.

అదే ఖాళీ కడుపుతో మద్యం తాగడం వల్ల తల తిరగడం, నడవడంలో ఇబ్బంది, మాటలు అస్పష్టంగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఖాళీ కడుపుతో తాగితే, కొన్ని నిమిషాల్లోనే మద్యం మరింత మత్తుగా అనిపిస్తుంది. ఫలితంగా వాంతులు, వికారం వస్తుంది.

అందుకే ఖాళీ కడుపుతో మద్యం తాగడం శరీరానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో మద్యం తాగే అలవాటు ఉన్నవారికి దీనితోపాటు భవిష్యత్తులో అనేక వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. మద్యం తాగడం ప్రాథమికంగా ఆరోగ్యానికి హానికరం. అందులోనూ దానిని ఖాళీ కడుపుతో తాగడం మరింత డేంజర్.

గమనిక: మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ కథనం ఉద్దేశ్యం కేవలం సమాచారాన్ని అందించడం మాత్రమే. మరిన్ని వివరాల కోసం నిపుణులు, వైద్యులను సంప్రదించడం బెటర్.




