AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ డేగ కళ్లకు 30 సెకన్ల ఛాలెంజ్.. ఈ వైరల్ ఫొటోలో ఫస్ట్ మీకేం కనిపిస్తోంది..!

Optical Illusion: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల చిత్రాలు వైరల్ అవుతుంటాయి. కానీ, మన మెదడుకు పదును పెట్టే, కంటి చూపు సామర్థ్యాన్ని పరీక్షించే 'ఆప్టికల్ ఇల్యూజన్' చిత్రాలకు నెటిజన్లు ఎప్పుడూ ఫిదా అవుతుంటారు. తాజాగా ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఈ మైండ్ గేమ్ మీ తెలివితేటలకు ఒక పెద్ద సవాల్‌ విసురుతోంది.

Optical Illusion: మీ డేగ కళ్లకు 30 సెకన్ల ఛాలెంజ్.. ఈ వైరల్ ఫొటోలో ఫస్ట్ మీకేం కనిపిస్తోంది..!
Optical Illusion
Venkata Chari
|

Updated on: Jun 05, 2026 | 1:57 PM

Share

Optical Illusion: సాధారణంగా పజిల్స్ లేదా పొడుపు కథలను విప్పడం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. ఖాళీ సమయాల్లో ఇటువంటి మైండ్ గేమ్స్ ఆడటం వల్ల మనస్సు రిలాక్స్ అవ్వడమే కాకుండా, ఆలోచనా శక్తి కూడా వేగంగా పెరుగుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో కంటికి, మెదడుకు సవాల్ విసిరే విభిన్నమైన ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ట్రిక్కీ ఫోటో కూడా చూడటానికి చాలా సింపుల్‌గా అనిపించినా, సమాధానం వెతకడం మొదలుపెడితే తల ప్రాణం తోకకు రావడం ఖాయం!

30 సెకన్ల ఛాలెంజ్.. మీరు రెడీనా?

ఈ వైరల్ చిత్రాన్ని మొదటిసారి చూసినప్పుడు మీ కంటికి మొదట ఏం కనిపిస్తోంది? ఒక అందమైన పూలకుండీ (ఫ్లవర్ వేస్) ముందు నిలబడి, దానికి పూలను అమర్చుతున్న ఒక మహిళ చిత్రం మాత్రమే అందరికీ కనిపిస్తుంది. కానీ, అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ చిత్రంలో కేవలం ఆ మహిళ ముఖం మాత్రమే లేదు.. ఆమెతో పాటు కొన్ని రహస్య ముఖాలు కూడా ఇందులో దాగి ఉన్నాయి. మీది గనుక డేగ కళ్లయితే, మీరు నిజంగా బుద్ధిమంతులైతే కేవలం 30 సెకన్లలో ఆ దాగున్న ముఖాలను కనిపెట్టండి చూద్దాం. ఇదో మీకు ఓపెన్ ఛాలెంజ్!

చిత్రం వెనుక దాగున్న ఆ రహస్య ముఖాలు ఎక్కడ ఉన్నాయి?

సమయం అయిపోతున్నా మీకు ఆ ముఖాలు దొరకడం లేదా? ఎంత వెతికినా చిత్రంలో ఏమీ కనిపించడం లేదని తల పట్టుకోకండి, మేమే ఆ సీక్రెట్ ఏంటో చెబుతాం. ఈ చిత్రాన్ని కొంచెం నిశితంగా గమనిస్తే మీకు ఒక అద్భుతం కనిపిస్తుంది. నిజానికి ఈ చిత్రంలో మొత్తం మూడు ముఖాలు ఉన్నాయి. మొదటిది మనకు నేరుగా కనిపిస్తున్న ఆ మహిళ ముఖం. మరి మిగిలిన రెండు ముఖాలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? ఆ పూలకుండీకి ఇరువైపులా (రెండు వైపులా) జాగ్రత్తగా చూడండి. ఆ కుండీ ఆకారమే రెండు ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నట్లు డిజైన్ చేయబడింది. ఈ చిత్రాన్ని కొద్దిగా తిప్పి లేదా వంచి చూస్తే ఆ రెండు రహస్య ముఖాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి.

Optical Illusion 1st Face

కంటికి కనిపించేదంతా నిజం కాదు, నిజంగా ఉన్నదాన్ని కళ్లు అంత సులభంగా నమ్మవు అనడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రాలే సరైన ఉదాహరణ. మొదటి చూపులో కేవలం ఒక మహిళ, పూలకుండీ లాగా కనిపించిన ఈ చిత్రం.. లోతుగా పరిశీలిస్తే తనలో మూడు ముఖాలను దాచుకోవడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ ఆసక్తికరమైన ఛాలెంజ్‌ను మీ స్నేహితులకు కూడా షేర్ చేసి, వారు ఎంతసేపట్లో కనిపెడతారో పరీక్షించి చూడండి!

Optical Illusion 2nd Face

మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us