AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భిణి మృతి తర్వాత ఆసుపత్రిలో కలకలం.. మృతదేహంపై ఉన్న 3 తులాల పుస్తెలతాడు మాయం!

Bhuvanagiri Hospital News: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణి సుస్మిత మృతదేహంపై ఉన్న 3 తులాల బంగారు పుస్తెలతాడు కనిపించకపోవడంతో వివాదం చెలరేగింది. ఆసుపత్రి సిబ్బందిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టగా, పోలీసులు విచారణ ప్రారంభించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

గర్భిణి మృతి తర్వాత ఆసుపత్రిలో కలకలం.. మృతదేహంపై ఉన్న 3 తులాల పుస్తెలతాడు మాయం!
Woman Gold Theft
M Revan Reddy
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 1:27 PM

Share

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ మృతదేహంపై ఉన్న పుస్తెలతాడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వలిగొండ మండలం వర్కట్ పల్లికి చెందిన దివ్యాంగురాలైన దాసరి సుస్మిత (36)కు నార్కట్ పల్లికి చెందిన నాగరాజుతో ఏడాది క్రితం వివాహమైంది. ఇద్దరూ వర్కెట్ పల్లిలో ఉంటున్నారు. సుస్మిత వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏడునెలల గర్భవతిగా ఉన్నారు.

బుధవారం అర్ధరాత్రి తర్వాత అస్వస్థతకు గురికావడంతో 108 అంబులెన్స్‌లో భువనగిరి జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఉదయం ఆస్పత్రి సిబ్బంది పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని మార్చురీ వద్దకు తరలించారు. అయితే ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడు లేకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బందిని అడిగినా తమకు తెలియదనీ బదులిచ్చారు. దీంతో సుస్మిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుస్మితను ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది, వైద్యులను పోలీసులు విచారణ చేశారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల పరిశీలిస్తున్నారు. సుస్మితను చికిత్స కోసం తీసుకొచ్చిన సమయంలో మెడలో బంగారు పుస్తెలతాడు ఉందని ఆసుపత్రి సిబ్బంది కాజేశారని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు బంధువులు.

ఆసుపత్రి ప్రాంగణంలోనే కుటుంబ సభ్యులు నిరసన చేపట్టడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

Follow Us
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
కాలసర్ప దోషంతో ఆ రాశుల వారికి మహర్దశ! ఇక గోల్డెన్ టైమ్ మొదలైనట్టే
కాలసర్ప దోషంతో ఆ రాశుల వారికి మహర్దశ! ఇక గోల్డెన్ టైమ్ మొదలైనట్టే
ఏపీలోనూ గోవా తరహా బీచ్ షాక్స్.
ఏపీలోనూ గోవా తరహా బీచ్ షాక్స్.
ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్!
ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్!
అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్.
అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్.
స్నానం చేసే నీటిలో చిటికెడు కర్పూరం వేయండి..ఈ ప్రయోజనాలు తెలిస్తే
స్నానం చేసే నీటిలో చిటికెడు కర్పూరం వేయండి..ఈ ప్రయోజనాలు తెలిస్తే
మీకు ఖాళీ స్థలం లేదా బిల్డింగ్ ఉందా.. ఇంట్లో కూర్చునే నెలకు..
మీకు ఖాళీ స్థలం లేదా బిల్డింగ్ ఉందా.. ఇంట్లో కూర్చునే నెలకు..
బుడ్డోడి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియాలోకి ఆయా షేర్?
బుడ్డోడి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియాలోకి ఆయా షేర్?