AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వారెవ్వా.. ఏపీలోనూ గోవా తరహా బీచ్ షాక్స్.. మద్యం విక్రయాలు కూడా..!

ఆంధ్రప్రదేశ్‌లో గోవా తరహా బీచ్ పర్యాటకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో సూర్యలంక, విశాఖ బీచ్‌లలో నాలుగు బీచ్ ష్యాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ష్యాక్స్‌లో ఆహారం, వినోదంతో పాటు మద్యం విక్రయాలకు కూడా అనుమతి ఉండనుంది. పర్యాటక రంగానికి ఊతమివ్వడంతో పాటు తీర ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా చెబుతోంది.

Andhra Pradesh: వారెవ్వా.. ఏపీలోనూ గోవా తరహా బీచ్ షాక్స్.. మద్యం విక్రయాలు కూడా..!
Beach Shacks
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 1:21 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహాలో సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ ష్యాక్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పర్యాటకులను ఆకర్షించడం, తీర ప్రాంత ఆర్థిక కార్యకలాపాలను పెంచడం లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

తొలి దశలో రెండు ప్రాంతాల్లో అమలు

ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్, విశాఖపట్నం బీచ్ ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో ప్రాంతంలో రెండు చొప్పున మొత్తం నాలుగు షాక్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ఫలితాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని ఇతర తీర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నాయి.

బీచ్ పర్యాటకానికి కొత్త రూపం

బీచ్ ష్యాక్స్ అంటే సముద్ర తీరంలో ఏర్పాటు చేసే తాత్కాలిక రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు. పర్యాటకులు సముద్ర అందాలను ఆస్వాదిస్తూ ఆహారం, పానీయాలు తీసుకునేలా వీటిని రూపొందిస్తారు. గోవాలో ఈ విధానం ఎంతో ప్రజాదరణ పొందింది. ఇప్పుడు అదే తరహా అనుభూతిని ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

మద్యం విక్రయాలపై చర్చ కేబినెట్

కేబినెట్ ఆమోదం ప్రకారం ఈ బీచ్ షాక్స్‌లో మద్యం విక్రయాలు, వినియోగానికి అనుమతి ఉండనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీటి నిర్వహణకు అవకాశం కల్పించనున్నారు. దీంతో పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు ఆదాయ వనరుల పెంపు కోసం మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఆదాయం – పర్యాటకం రెండింటిపైనా దృష్టి

రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యాటక కార్యకలాపాలను పెంచడంతో పాటు అదనపు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవా తరహా బీచ్ సంస్కృతి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మేరకు విజయవంతమవుతుందనేది పైలట్ ప్రాజెక్టు ఫలితాల తర్వాత స్పష్టత రానుంది.

Follow Us