Video: జింక పిల్లను పట్టిన ఆనందంలో మొసలి.. వెనక్కి తిరిగి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..!
Hippo Saves Baby Antelope Video: ప్రకృతి నియమాలను సైతం తలకిందులు చేస్తూ జరిగిన ఈ సంఘటన, జీవ వైవిధ్యంలోని వింతలను మనకు మరోసారి పరిచయం చేసింది. ఆపదలో ఉన్న ఒక చిన్న ప్రాణాన్ని కాపాడిన ఆ హిప్పోని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Crocodile Hunting Antelope: నీటి ఒడ్డున చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక జింక పిల్లను, నమ్మలేని విధంగా ఒక నీటి గుర్రం కాపాడిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రూరమైన మొసలి నోటికి చిక్కిన ఆ చిన్న ప్రాణాన్ని రక్షించడానికి ప్రకృతి చూపిన ఈ విచిత్రమైన పోరాటం నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.
మృత్యువు అంచున చిన్నారి జింక ప్రాణం..
ఆఫ్రికాలోని ఒక జలాశయం ఒడ్డున ఊహించని ఒక అద్భుతం జరిగింది. ఒక చిన్న జింక పిల్ల ప్రమాదవశాత్తు నీటిలోకి దిగింది. అయితే, అదే నీటిలో పొంచి ఉన్న ఒక భారీ ముసలి ఆ చిన్నారి ప్రాణాన్ని వేటాడటానికి వేగంగా దూసుకొచ్చింది. మొసలి కోరల మధ్య చిక్కుకుని ఆ జింక పిల్ల ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతుండగా, అక్కడ ఉన్న పర్యాటకులు శ్వాస బిగబట్టి చూశారు. ఆ చిన్న ప్రాణం ఇక ముసలికి ఆహారం కావడం ఖాయం అనుకున్న క్షణంలో కథ ఊహించని మలుపు తిరిగింది.
రంగంలోకి దిగిన హిప్పో..
సరిగ్గా అదే సమయంలో, అక్కడ ఉన్న ఒక భారీ నీటి గుర్రం (హిప్పో) వేగంగా ముసలి వైపు దూసుకొచ్చింది. సాధారణంగా నీటి గుర్రాలు తమ ప్రాంతం (టెరిటరీ) విషయంలో చాలా పట్టుదలగా ఉంటాయి. తమ పరిధిలోకి ఎవరు వచ్చినా అవి సహించవు. కానీ, ఇక్కడ ఆ నీటి గుర్రం మొసలిపై దాడి చేసి, దానిని అక్కడి నుంచి బలంగా తరిమికొట్టింది. ముసలి భయంతో పారిపోవడంతో ఆ జింక పిల్ల ప్రాణాలతో బయటపడింది.
తల్లి ఒడికి చేరిన వేళ..
నీటి గుర్రం చేసిన ఈ సాహసంతో ముసలి బారి నుంచి తప్పించుకున్న జింక పిల్ల, నెమ్మదిగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. అప్పటికే ఒడ్డున ఆందోళనతో వేచి చూస్తున్న దాని తల్లి, తన బిడ్డను చూసి ఊపిరి పీల్చుకుంది. ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడ ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. జంతు ప్రపంచంలో క్రూరత్వమే కాదు, ఇలాంటి అరుదైన వీడియోలు కూడా ఉంటాయని ఈ సంఘటన నిరూపించింది.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




