AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నీ జిమ్మడిపోను.. ఒక్క క్షణంలో పక్కనోళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించావుగా.. వీడియోలో ఫైనల్ ట్విస్ట్ అదుర్స్..!

Viral Kitchen Video: ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ అయిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే 2.3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. వేలాది మంది దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ చిన్న వీడియో ఇప్పుడు అంతర్జాలంలో ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది.

Video: నీ జిమ్మడిపోను.. ఒక్క క్షణంలో పక్కనోళ్లకు హార్ట్ ఎటాక్ తెప్పించావుగా.. వీడియోలో ఫైనల్ ట్విస్ట్ అదుర్స్..!
Viral Kitchen Video
Venkata Chari
|

Updated on: Jun 05, 2026 | 12:02 PM

Share

Viral Kitchen Video: కంటికి కనిపించే ప్రతి దృశ్యం వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని సంఘటనలు మనల్ని నవ్విస్తే, మరికొన్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హోటల్ కిచెన్ వీడియో నెటిజన్లను విస్మయానికి గురిచేస్తోంది. సడన్‌గా ఓ వ్యక్తి ఆగిపోవడం, ఎంత పిలిచినా, చేతితో తడిమినా ఉలుకు, పలుకు లేకపోవడంతో తోటి సిబ్బంది షాకయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

వంటగదిలో జరిగిన ఆ వింత సంఘటన..

సాధారణంగా పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలోని వంటగదులు ఎంతో బిజీగా ఉంటాయి. మాస్టర్ చెఫ్‌ల నుంచి సాధారణ సిబ్బంది వరకు అందరూ ఎంతో బిజీగా ఉంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన చేతిలో ప్లేట్ తీసుకుని వెళ్తుంటాడు. అయితే, సడన్‌గా ఆగిపోయి, చేతిలో ప్లేట్ కిందికి పడేస్తాడు. అలాగే నిల్చుని మొహంలో విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న వ్యక్తి సదరు వ్యక్తి వద్దకు వచ్చి పిలుస్తుంటాడు. అలాగే, చేతితో తాకుతూ కదిపేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ, ఎటువంటి చలనం ఉండదు. ఈ క్రమంలో పక్కన ఉన్నమరో వ్యక్తి కొన్ని నీళ్లు తీసుకుని రమ్మని చెప్పి మొహంపై చిలకరిస్తుంటారు. అయితే, ఆ వ్యక్తిలో ఎటువంటి చలనం ఉండదు. కాగా, అసలు అతను చలించకపోవడంతో ఏమైందోనని తోటి సిబ్బంది కంగారు పడతారు. అయితే, ఇక్కడే ఓ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తాడు ఆ చలనం లేని వ్యక్తి. దీంతో పక్కన ఉన్న తోటి సిబ్బంది కోపంతోపాటు నవ్వుతూ ఆ వ్యక్తిని సరదాగా కొడతారు. అసలు అక్కడ జరిగిన విషయం ఏంటో తెలిస్తే మీరు కూడా నవ్వేస్తారు. ఆ చలనం లేని వ్యక్తికి తుమ్ము వస్తుంది. అయితే, ఆ తుమ్ము సరిగ్గా రావకపోడంతో అందుకోసం ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో మొహంలో వెరైటీగా ఎక్సెప్రెషన్స్ ఇస్తూ చివరికి గట్టిగా తుమ్ముతాడు. దీంతో అక్కడంతా నవ్వులు పూస్తాయి.

నెటిజన్ల ఆగ్రహం..!

ఈ వీడియోను క్షుణ్ణంగా గమనించిన నెటిజన్లు ఒకే ఒక విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. “అక్కడ అంత జరుగుతున్నా, ఆ వ్యక్తి ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ మార్చలేదంటూ” అంటూ కామెంట్లు పెడుతున్నారు. సదరు వ్యక్తి ఎంతో ప్రశాంతంగా, తనకేమీ తెలియనట్లు నిలబడటం అక్కడి వారిని, ఇటు నెటిజన్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది. అతడి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే, ‘జరిగితే జరిగింది.. నాకేంటి?’ అనే ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us