AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్! తెలంగాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో!

హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఉచిత MMTS ప్రయాణంపై ఆశలు తాత్కాలికంగా చల్లారాయి. MMTS రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. భారీ నష్టాలు, పెండింగ్ బకాయిలను కారణంగా చూపిన రైల్వే శాఖ, ఆర్థిక భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తేనే ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్!  తెలంగాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో!
Mmts Hyderabad
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 1:20 PM

Share

హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఉచిత MMTS ప్రయాణం కలగానే మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. MMTS రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. ఇప్పటికే భారీ నష్టాల్లో నడుస్తున్న MMTS సేవలపై మరింత ఆర్థిక భారం మోపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన లేఖలో రైల్వే బోర్డు పలు కీలక అంశాలను ప్రస్తావించింది. గత ఏడాది ఒక్కటే MMTS సేవల నిర్వహణలో దాదాపు రూ.160 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. మరోవైపు MMTS ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన సుమారు రూ.490 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేసింది.

ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా MMTS రైళ్లలో ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది అమలు చేయడం వల్ల నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ పథకం వల్ల ఏర్పడే మొత్తం ఆర్థిక భారాన్ని భరిస్తామని అధికారిక హామీ ఇస్తే ప్రతిపాదనను పరిశీలించే అవకాశం ఉందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అలాంటి హామీ లేకుండా ఈ పథకానికి ఆమోదం ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

MMTS సేవల కొనసాగింపు, ఆర్థిక స్థిరత్వం తమకు అత్యంత ప్రాధాన్యమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఆదాయంపై ప్రభావం చూపే నిర్ణయాలకు తగిన ఆర్థిక మద్దతు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో నగర ప్రయాణికులకు ఉచిత MMTS ప్రయాణంపై ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం బకాయిల చెల్లింపు, భవిష్యత్తు ఆర్థిక భారం అంశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
గుడ్ న్యూస్.. ఉద్యోగులకు రూ.1.25 కోట్ల బీమా..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
మీ టీవీ సైజును బట్టి కరెంట్ బిల్లు.. నెలకు ఏ టీవీకి ఎంత..
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
సత్తా చాటిన శ్రీచరణి, రాధాయాదవ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
ఇక దబ్బిడిదిబిడే..! చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌పై పోలీసుల సర్జికల్ స్
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
మాస్క్‌లో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న..
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
పెళ్లి, ఉద్యోగం, సంతాన రొట్టెల కోసం పోటెత్తనున్న భక్తులు!
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ప్రధాని మోదీతో అమెజాన్ సీఈవో భేటీ.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడి..
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ముదిరిన వైరం.. టాస్ వేళ షేక్‌హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు!
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..
ఉక్కు లాంటి బలం.. ఆరోగ్యం.. మన పూర్వీకుల 100 ఏళ్ల సీక్రెట్..