AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 4 శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారికి అంతా కష్టకాలం!

మేషం ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావడమే కాకుండా అన్నింట్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. అంతేకాక వాహనయోగం కూడా పొందుతారు. వృషభం ఈ రాశివారు తమ బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మిథునం ఈ రాశివారు ఎంతగా కష్టపడినా వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. పనుల్లో జాప్యం జరగడం.. అంతేకాక […]

అక్టోబర్ 4 శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశివారికి అంతా కష్టకాలం!
Ravi Kiran
|

Updated on: Oct 04, 2019 | 7:49 AM

Share

మేషం

ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావడమే కాకుండా అన్నింట్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. అంతేకాక వాహనయోగం కూడా పొందుతారు.

వృషభం

ఈ రాశివారు తమ బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.

మిథునం

ఈ రాశివారు ఎంతగా కష్టపడినా వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. పనుల్లో జాప్యం జరగడం.. అంతేకాక అవి నిదానంగా సాగుతుంటాయి. ముఖ్యంగా ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం

ఈ రాశివారికి అన్నింటా కష్టకాలమే ఉంటుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు, శ్రమకు తగిన ఫలితం దక్కకపోవడం.. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు వీరికి ఇబ్బందులు గురి చేస్తాయి.

సింహం

ఈ రాశివారికి కుటుంబసభ్యుల సహకారం పుష్కలంగా ఉంటుంది. వారు చేపట్టిన కార్యక్రమాలన్నింటా విజయం వరిస్తుంది. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ధన లాభం ఉంది.

కన్య

ఈ రాశివారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచిది. ఈరోజు ఎక్కడికైనా ప్రయాణించాలనుకంటే.. దానికి కాస్త విరామం ఇవ్వడం మంచిది. ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. బంధువులతో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

తుల

ఈరోజు ఈ రాశివారికి అద్భుతంగా ఉంది. కొత్త పరిచయాలు, చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలు, విందు వినోదాలతో అంతా ఆనందంగా గడుస్తుంది.

వృశ్చికం

ఈ రాశివారికి తమ సోదరుల నుంచి సహాయసకారాలు అందినా.. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం ఉండడం వల్ల పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అప్పులు తీరడంతో కాస్త ఊరట లభిస్తుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తులాభాలు పొందుతారు.

మకరం

వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

కుంభం

ఈ రాశివారికి అన్నింటా విజయం సాధిస్తారు. కీలకమైన వ్యవహారాలు అన్ని పూర్తవుతాయి. వ్యాపార విషయాలలో మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మీనం

కుటుంబసభ్యులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. చేపట్టిన కాంట్రాక్టులలో లాభాలు పొందుతారు.

తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?