AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివసేన మాస్టర్ ప్లాన్‌తో.. ఈ యువనేత ‘వార్’ వన్ సైడ్ అయినట్లే!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు శివసేన పార్టీకి కీలకంగా మారాయి. ఎప్పటిలానే ఈసారి కూడా బీజేపీ-శివసేన కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి సీఎం పదవిని చేపట్టాలని శివసేన పక్కా ప్రణాళికలు రచిస్తోంది. 1966లో బాల్ థాక్రే శివసేన పార్టీని స్థాపించారు. అయితే అప్పటి నుంచి నేటివరకు ఈ థాక్రే కుటుంబం నుంచి ఎవ్వరూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత ఈ కుటుంబం […]

శివసేన మాస్టర్ ప్లాన్‌తో.. ఈ యువనేత 'వార్' వన్ సైడ్ అయినట్లే!
Ravi Kiran
|

Updated on: Oct 04, 2019 | 10:01 AM

Share

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు శివసేన పార్టీకి కీలకంగా మారాయి. ఎప్పటిలానే ఈసారి కూడా బీజేపీ-శివసేన కలిసి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి సీఎం పదవిని చేపట్టాలని శివసేన పక్కా ప్రణాళికలు రచిస్తోంది. 1966లో బాల్ థాక్రే శివసేన పార్టీని స్థాపించారు. అయితే అప్పటి నుంచి నేటివరకు ఈ థాక్రే కుటుంబం నుంచి ఎవ్వరూ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇక దాదాపు ఐదున్నర దశాబ్దాల తర్వాత ఈ కుటుంబం నుంచి ఈసారి ఓ యువనేత ఎన్నికల బరిలోకి దిగారు. అతనే ఉద్దవ్ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే.. ఇక అతడు సీఎం పీఠం ఎక్కాలంటే.. తెలుగువారి ఓట్లే కీలకం కానున్నాయి.

శివసేనకు కంచుకోట లాంటి వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా యువసేన చీఫ్ ఆదిత్య థాక్రే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. థాక్రే కుటుంబం నుంచి ఆదిత్య థాక్రే మొదటిసారి ఎన్నికల బరిలో దిగడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఆదిత్య థాక్రే గెలుపే లక్ష్యంగా వ్యహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తెలుగు సహా ఇతర భాషల్లో ప్రచారం చేస్తున్నారు. వర్లీ ఏరియాలో ఉన్న తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు ‘నమస్తే వర్లీ’ అనే ఫ్లెక్సీలతో పలకరించారు. అటు గుజరాతీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో గుజరాతీ భాషలో.. ముస్లిం మెజార్టీ ఏరియాల్లో  ఉర్దూలో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. అంతేకాక థాక్రే కుమారుడి రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో తెలుగువారి పాత్రే కీలకం కానుంది.

ఇకపోతే ప్రస్తుతం వర్లీ నియోజకవర్గం నుంచి శివసేన ఎమ్మెల్యే సునీల్ షిండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఇది ఆదిత్యకు కలిసొచ్చే అంశం. ఇక ఇక్కడ కాంగ్రెస్–ఎన్సీపీ మిత్రపక్షం లేదా వంచిత్ ఆఘాడి ఎమ్మెన్నెస్ అభ్యర్ధులు పోటీ చేసినా ఆదిత్య థాక్రే గెలుపు వన్ సైడ్ అయిపోనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆదిత్యపై పోటీ చేస్తే డిపాజిట్లుగా కూడా రావనే పరిస్థితి ఏర్పడింది. అందుకే మిగిలిన అభ్యర్థులు పోటీ చేయడం కంటే ఆదిత్యను ఏకగ్రీవంగా గెలిపించాలని శివసేన నాయకులు, మిగతా పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నారని ఇన్‌సైడ్ టాక్. మరోవైపు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) ఆదిత్య థాక్రేతో పోరు ఎందుకని వెనక్కి తగ్గాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ యువనేతకు వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది