టిక్ టాక్ స్టార్‌కు ఎమ్మెల్యే టికెట్.. బీజేపీ సంచలన నిర్ణయం

టిక్ టాక్.. ఇప్పుడు చాలామంది యువతకు ఇది లేకపోతే నిద్రపట్టదు. తరుచూ ఏదో ఒక వీడియోను అప్‌లోడ్ చేస్తూ.. సమయాన్ని గడిపేస్తుంటారు. ఈ యాప్ వల్ల కొందరు సెలబ్రిటీలయ్యారు. తమ అసాధారణ టాలెంట్‌తో ఓవర్‌నైట్ స్టార్లుగా ఎదిగారు. సినీ రంగానికే పరిమితమైన ఈ టాలెంట్ ప్రస్తుతం రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగపడుతోంది. ఇప్పుడు హర్యానాలో అదే జరిగింది. టిక్ టాక్ వీడియోలతో విపరీతమైన పాపులారీటీ సంపాదించిన సోనాలీ ఫోగాట్ అనే యువతికి బీజేపీ పార్టీ ఏకంగా ఎమ్మెల్యే […]

టిక్ టాక్ స్టార్‌కు ఎమ్మెల్యే టికెట్.. బీజేపీ సంచలన నిర్ణయం
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 04, 2019 | 10:01 AM

టిక్ టాక్.. ఇప్పుడు చాలామంది యువతకు ఇది లేకపోతే నిద్రపట్టదు. తరుచూ ఏదో ఒక వీడియోను అప్‌లోడ్ చేస్తూ.. సమయాన్ని గడిపేస్తుంటారు. ఈ యాప్ వల్ల కొందరు సెలబ్రిటీలయ్యారు. తమ అసాధారణ టాలెంట్‌తో ఓవర్‌నైట్ స్టార్లుగా ఎదిగారు. సినీ రంగానికే పరిమితమైన ఈ టాలెంట్ ప్రస్తుతం రాజకీయ పార్టీలకు కూడా ఉపయోగపడుతోంది. ఇప్పుడు హర్యానాలో అదే జరిగింది. టిక్ టాక్ వీడియోలతో విపరీతమైన పాపులారీటీ సంపాదించిన సోనాలీ ఫోగాట్ అనే యువతికి బీజేపీ పార్టీ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.

ఎన్నికలు వచ్చాయంటే చాలు ప్రజలను ఆకర్షించడానికి బీజేపీ కొత్త వ్యూహాలను రచిస్తుంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ను జోడిస్తూ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తుంది. బుల్లితెరపై సందడి చేసిన సోనాలి ఫోగాట్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడప్పుడూ సరదాగా టిక్ టాక్ వీడియోలు చేస్తుండేవారు. దీంతో అతి తక్కువ సమయంలోనే ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. టిక్ టాక్‌లో ఆమె ఇప్పుడు పెద్ద స్టారయ్యారు. ఆమెకున్న ఫాలోయింగ్‌ను చూసిన బీజేపీ నేతలు ఆమెను ఎన్నికల బరిలోకి దించాలని భావించారు. కమలదళం పెద్దలు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచించి.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఆదంపూర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.

రెండో జాబితాలో ఆమెకు బీజేపీ ఆదంపూర్ టికెట్‌ను కేటాయించారు. ఈసారి ఎలాగైనా ఆ నియోజకవర్గం నుంచి గెలుపొందాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు ఈమెకు టికెట్ ప్రకటించిన తర్వాత అమాంతం టిక్ టాక్ ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోవడం విశేషం. మరి ఈ టిక్ టాక్ స్టార్ అదృష్టం బీజేపీకి కలిసొస్తుందా లేదా అనేది మరికొన్ని రోజులు వేచి చూడాలి.