AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు తలైవా.. ఇప్పుడు దళపతి.. సేతుపతి క్రేజే వేరు!

విజయ్ సేతుపతి.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో సూపర్ స్టార్‌ అయినా.. ఆయన చేసిన వైవిధ్యమైన రోల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యారు. లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషించి.. ఫ్యాన్స్ మన్ననలు పొందారు. దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి తాజాగా ఓ క్రేజీ కాంబోలో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారు. తలైవా రజనీకాంత్ హీరోగా వచ్చిన […]

అప్పుడు తలైవా.. ఇప్పుడు దళపతి.. సేతుపతి క్రేజే వేరు!
Ravi Kiran
|

Updated on: Oct 04, 2019 | 11:08 AM

Share

విజయ్ సేతుపతి.. ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో సూపర్ స్టార్‌ అయినా.. ఆయన చేసిన వైవిధ్యమైన రోల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యారు. లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర పోషించి.. ఫ్యాన్స్ మన్ననలు పొందారు. దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి తాజాగా ఓ క్రేజీ కాంబోలో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారు.

తలైవా రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పెటా’ సినిమాలో విలన్‌గా నటించిన సేతుపతి.. ఇప్పుడు మరోసారి అదే అవతారమెత్తనున్నాడు. దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఓ మూవీ తెరకెక్కున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్ రోల్‌కు విజయ్ సేతుపతి అంగీకారం తెలిపారు. ఇద్దరూ మాస్ హీరోలు.. పైగా ఒకే సినిమాలో ఇంకేముంది ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అని చెప్పొచ్చు. సేతుపతి ఏ క్యారెక్టర్ చేసినా.. ఈజీతో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. దీంతో ఇద్దరి హీరోల మధ్య హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఖచ్చితంగా ఉంటాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ మాళవిక మోహనన్ ఎంపికైంది. ఎక్స్‌బీ ఫిలిం క్రియేట‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిన్న జరిగాయి. ప్రస్తుతం హీరో,హీరోయిన్ల మధ్య కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అనిరుథ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2020 వేసవికి విడుదల కానుంది. దళపతి విజయ్ ప్రస్తుతం ‘బిగిల్’ షూటింగ్‌లో బిజీగా ఉండగా.. విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు.

Follow Us
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!