AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో పూర్తి లాక్ డౌన్ అవసరం లేదు, కోవిడ్ ప్రొటొకాల్స్ పాటిస్తే చాలు, లాన్సెట్ ఇండియా టాస్క్ ఫోర్స్

దేశంలో కోవిడ్ అదుపునకు పూర్తి లాక్ డౌన్ అవసరం లేదని లాన్సెట్ ఇండియా టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా 10 మందికి జనం  మించకుండా  చూడాలని, కఠిన ప్రొటొకాల్స్ పాటించాలని సూచించింది

దేశంలో పూర్తి లాక్ డౌన్ అవసరం లేదు, కోవిడ్ ప్రొటొకాల్స్ పాటిస్తే చాలు, లాన్సెట్ ఇండియా టాస్క్ ఫోర్స్
No Lockdown Says Lancet India Taskforce
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 03, 2021 | 4:43 PM

Share

దేశంలో కోవిడ్ అదుపునకు పూర్తి లాక్ డౌన్ అవసరం లేదని లాన్సెట్ ఇండియా టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా 10 మందికి జనం  మించకుండా  చూడాలని, కఠిన ప్రొటొకాల్స్ పాటించాలని సూచించింది. ఈ మేరకు కంటెయిన్మెంట్ మెజర్స్ చెక్ లిస్టును కేంద్రానికి సమర్పించింది.  రోజుకు ఎన్ని కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి, కొత్త కేసులెన్ని, ఐసీయూ బెడ్ల రేట్ల వినియోగం వంటివి చూడాలని, రోజుకు 10 లక్షల మందికి టెస్టులు చేసి, వ్యాక్సిన్లు వేయాలని సూచించింది. స్టేక్ హోల్డర్లతో విస్తృత చర్చలు జరిపి లాక్ డౌన్ విధిస్తే కలిగే ఆర్ధిక పరిణామాలను అంచనా వేయాలని ఈ బృందం కోరింది. వాణిజ్య సంస్థలు, మార్కెట్లు వంటివాటిని మూసివేయడంవల్ల కలిగే ఆర్ధిక నష్టాలను బేరీజు వేయాలని, లాక్ డౌన్ అన్నది ఆప్షన్   కాదని ఈ బృందం అభిప్రాయపడింది. దేశాన్ని లో జోన్, మిడిల్, హైరిస్క్ జోన్లుగా విభజించాలని, లో జోన్ గా పరిగణించిన చోట్ల, స్కూళ్ళు, కాలేజీలు,  మార్కెట్లు మొదలైనవి తెరవవచ్చునని పేర్కొంది. అయితే మాస్కుల ధారణను తప్పనిసరి చేయాలని కోరింది. మిడిల్ రిస్క్ జోన్లలో పాక్షికంగా ఆంక్షలను అమలు చేయవచ్చునని, కార్యాలయాల్లో సగం సిబ్బందిచేత పనులు చేయించాలని, పరిస్థితులను బట్టి స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలను తెరవవచ్చునని, ఇక హై  రిస్క్ జోన్లలో ఆయా ప్రాంతాలను బట్టి కంటెయిన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలనీ, విద్యాసంస్థలను మూసి ఉంచాలని, వీధుల శానిటైజేషన్ వంటి కార్యక్రమాలను చేబట్టాలని లాన్సెట్ ఇండియా టాస్క్ ఫోర్స్ సూచించింది.

హాట్ స్పాట్ జిల్లాల్లో ఆరు నుంచి 10 వారాలపాటు షాపులు, ఫ్యాక్టరీలు, గుడులు, ప్రార్థనా స్థలాలను మూసివేయాలని,ప్రజలకు ఆర్టీ ,  పీ ఆర్ టీ టెస్టింగులను ముమ్మరం చేయాలని కూడా సూచించారు. అటు కేంద్రం కూడా పూర్తి లాక్ డౌన్ కు విముఖత చూపుతోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి  తగిన నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం అభిప్రాయపడుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Municipal Elections 2021: పాలమూరులో తిరుగులేని టీఆర్ఎస్.. అచ్చంపేట, జడ్చర్ల మున్సిపాలిటీలు కైవసం

Telangana Municipal Corporations Election Results 2021 LIVE: తెలంగాణ మినీ మున్సిపల్ ఫలితాలు.. కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ