Breaking: తెలంగాణలో మందు బాబులకు షాక్..!
మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ

మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఎక్సైజ్ అధికారులు మాత్రం నో చెప్పేశారు. రేపటి నుంచి తెలంగాణలోని గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు లేవని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో మందు బాబులకు షాక్ తగిలినట్లైంది.
ఇదిలా ఉంటే మరోవైపు ఏపీలోనూ మందుబాబులకు షాక్ తగిలింది. సోమవారం నుంచి గ్రీన్ జోన్లలో అమ్మకాలకు ఓకే చెప్పినప్పటికీ.. మద్యం ధరలు 25 శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇక వైన్ షాపులకు వచ్చే వారు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని., సామాజిక దూరం పాటించాలని ఆదేశించింది.
Read This Story Also: నెల రోజుల తరువాత పాజిటివ్ కేసు.. గ్రీన్ నుంచి ఆరంజ్ జోన్‌కు మార్పు..!
Coronavirus Lockdown TelanganaGreen signal to liquor sales Green ZonesLiquor sales TelanganaLockdown 3.0 exceptionsTelangana excise department decision on Liquor sales