లాక్ డౌన్ ఎత్తివేతకు రెడీ ! ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
లాక్ డౌన్ ఎత్తివేతకు తాము రెడీ అని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇక ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు పని చేయవచ్చునన్నారు. కానీ ప్రైవేటు కార్యాలయాల్లో కేవలం 33 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామన్నారు...
లాక్ డౌన్ ఎత్తివేతకు తాము రెడీ అని ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇక ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు పని చేయవచ్చునన్నారు. కానీ ప్రైవేటు కార్యాలయాల్లో కేవలం 33 శాతం సిబ్బందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. వీటిలో ఐటీ హార్డ్ వేర్, మాన్యుఫాక్చరింగ్, ఈ-కామర్స్ యాక్టివిటీస్ ఉంటాయన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ఫోర్ వీలర్స్, టూ వీలర్స్ కి అనుమతిస్తున్నామని, అయితే ఫోర్ వీలర్స్ లో డ్రైవర్ తో బాటు ఇద్దరు, టూ వీలర్స్ లో ఒకరిని మాత్రమే అనుమతిస్తామని వివరించారు. పెళ్లిళ్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది మాత్రం హాజరు కావచ్ఛునని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.