బ్రేకింగ్: వారం రోజుల్లో కరోనా వాక్సిన్..!

అన్ని అనుకున్నట్లు కొనసాగితే మరో వారం రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే వాక్సిన్ రెడీ కాబోతోంది.. ఎస్.. అమెరికాలో టెక్సాన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో పరిశోధన చివరి దశ ప్రారంభానికి రంగం సిద్దమైంది.

బ్రేకింగ్: వారం రోజుల్లో కరోనా వాక్సిన్..!
Follow us
Rajesh Sharma

|

Updated on: May 04, 2020 | 9:57 AM

అన్ని అనుకున్నట్లు కొనసాగితే మరో వారం రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే వాక్సిన్ రెడీ కాబోతోంది.. ఎస్.. అమెరికాలో టెక్సాన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో పరిశోధన చివరి దశ ప్రారంభానికి రంగం సిద్దమైంది. వారం రోజుల ఆబ్జర్వేషన్ తర్వాత ఈ వాక్సిన్ కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించగలదా లేదా అన్నది తేలబోతోంది.

కరోనా వైరస్‌ను తట్టుకునేలా మానవుల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ వైరస్ ప్రయోగాలను టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ నిర్వహిస్తోంది. తొలి దశలన్నీ విజయవంతంగా పూర్తి కావడంతో తుది దశ ప్రయోగాల కోసం యూనివర్సిటీ ప్రయోగశాల రెడీ అయ్యింది. అయితే, తుది దశలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ఆరోగ్య కార్యకర్తలు ముందుకు రావాలని ఈ యూనివర్సిటీ పిలుపునిచ్చింది.

మనుషులపై ఆరోగ్య పరీక్షలు, వాక్సిన్ ప్రయోగాలను నిర్వహించేందుకు ఫెడరల్ పర్మిషన్స్ పొందిన ఏకైక యూనివర్సిటీ ఏ అండ్ ఎం కావడం విశేషం. ఇప్పటి వరకు పరిశోధనలు నిర్వహిస్తున్న వాటిలో ఒక్క ఏ అండ్ ఎం యూనివర్సిటీకి మాత్రమే ఫెడరల్ పర్మిషన్స్ వచ్చాయంటే వారి ప్రయోగాలు ఎంత నిక్కచ్చిగా.. లక్ష్యానికి దగ్గరగా వున్నాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు శాస్త్రవేత్తలు, వాటిని ఫాలో అవుతూ జర్నల్స్ రాస్తున్నవారు.

బీసీజీ వాక్సిన్‌తో కరోనా వైరస్‌ను పూర్తిగా నియంత్రించ లేకపోయినప్పటికీ.. దాన్ని చాలా మటుకు నిరోధించవచ్చని ఏ అండ్ ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్లోను బీసీజీ వాక్సిన్‌ను వినియోగిస్తున్న విషయాన్ని వారి గుర్తు చేస్తున్నారు. బీసీజీని మరికొంత మెరుగుపరచడం ద్వారా కరోనాకు వాక్సిన్‌ రూపొందిస్తున్న విషయం వారు వివరిస్తున్నారు. తుది దశ విజయవంతం అయితే, కనీసం ఆరు నెలల్లో వాక్సిన్ రెడీ అవుతుందని ఏ అండ్ ఎం వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం ఎఫ్.డీ.ఏ. అనుమతులు లభించినందువల్ల తొలి మూడు దశల ప్రయోగాలు ఇక అవసరం లేదని, ఏకంగా నాలుగో దశ ప్రయోగాలనే ఈ వారంలో ప్రారంభిస్తామని శాస్త్రవేత్తలంటున్నారు. ప్రయోగాలు ప్రారంభించిన వారం రోజుల్లోనే వాక్సిన్ సత్తా ఏంటో తేలిపోతుందని వారు చెబుతున్నారు. కరోనా వాక్సిన్ ప్రయోగాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీకి రెండున్నర మిలియన్ డాలర్ల ఆర్థిక ప్రోత్సాహం లభించనున్నది.